రేపే విడుదలవుతున్న ది ఫారినర్

  
నక్షత్ర మీడియా సమర్పించు చిత్రం  ది ఫారినర్. జేమ్స్ బాండ్ హీరో పియాడ్స్ బ్రోస్ట్ నన్ నటించిన ఈ చిత్రాన్ని మార్టిన్ కాంబేల్ దర్శకత్వంలో  ఎమ్ రాజశేఖర్, ఖాసీం సమర్పించగా నిర్మాత నక్షత్ర రాజశేఖర్ నిర్మిస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ  భాషలలో తెరకెక్కించనున్నారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడే విడుదలవుతున్న సందర్బంగా ఈ చిత్ర నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మీడియా తో మాట్లాడుతూ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని 100 నుంచి 200 థియేటర్స్ లలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నాము. ఇంట్రస్టింగ్ గా సాగే కథతో ప్రేక్షకులను ఆకట్టునేలా ఉంటుందని తెలిపారు. అంతరం హీరో మనోజ్ నందన్ మాట్లాడుతూ  జాకీ చాన్ ది ఫారిన్ టైటిలే పాజిటివ్ గా ఉంటుంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ను ఇష్టపడే వారికి బాగా నచ్చే చిత్రం అవుతుంది. ఈ చిత్తాన్ని ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తారు. నిర్మాతలు నక్షత్ర  రాజశేఖర్  తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ చిత్రాన్ని సమర్పించడం జరుగుతోందని చెప్పారు.