విరించి వ‌ర్మ‌, ఎం.ఎల్‌.కుమార్ చౌద‌రి కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం త్వ‌రలో ప్రారంభం

ఉయ్యాల జంపాల‌, మజ్ను వంటి క్యూట్ ల‌వ్‌స్టోరీస్‌ను తెర‌కెక్కించిన యంగ్ డైరెక్ట‌ర్ విరించి వ‌ర్మ ఇప్పుడు త‌న మూడో సినిమాను ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ బేన‌ర్‌పై ఎం.ఎల్‌.కుమార్ చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో కీర్తి కంబైన్స్ ప‌తాకంపై తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా…

Virinchi Varma, ML Kumar Chowdary New Movie Announcement
చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఎం.ఎల్‌.కుమార్ చౌద‌రి మాట్లాడుతూ – “రెండు వ‌రుస సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన యువ ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నుండ‌టం ఆనందంగా ఉంది. యూత్‌ఫుల్‌, ల‌వ్‌, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ స్క్రిప్ట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను సినిమా ఆక‌ట్టుకునేలా సినిమా రూపొంద‌నుంది. తెలుగు చల‌న చిత్రసీమ‌లో ఓ ప్ర‌ముఖ యువ క‌థానాయ‌కుడు ఈ సినిమాలో న‌టిస్తారు. ఈ సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాలను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.