శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా ప్రారంభం

యంగ్ అండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సరికొత్త సినిమా ప్రారంభోత్సవం నేడు (నవంబర్ 23) హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈ=నిర్మాత దిల్ రాజు, “14 రీల్స్ ఎంటర్ టైన్మేంట్స్” అధినేతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర, “మైత్రీ మూవీ మేకర్స్” అధినేతల్లో ఒకరైన వై.రవిశంకర్, ప్రముఖ దర్శకులు సుకుమార్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, రాజు సుందరం తదితరులు పాల్గొన్నారు.
హీరో శర్వానంద్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాజు సుందరం కెమెరా స్విచ్చాన్ చేయగా, దిల్ రాజు క్లాప్ కొట్టారు. సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్ ను దర్శకనిర్మాతలకు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరిలు మాట్లాడుతూ.. “నేడు రామానాయుడు స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవానికి పరిశ్రమ పెద్దలు విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, నిర్మాణం: శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, నిర్మాతలు: ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం: హను రాఘవపూడి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here