సోని చరిష్ఠ బర్త్ డే సెలబ్రేషన్స్ @ నేచర్ ఎవెన్యూ !!

Sony Charishta Bday Celebrations
యువ కథానాయకి సోని చరిష్ఠ బర్త్ డే వేడుక ‘నేచర్ ఎవెన్యూ ఇన్ ఫ్రా’లో ఘనంగా జరిగింది. ప్రముఖ నటుడు లోహిత్, నేచర్ ఎవెన్యూ ఇన్ ఫ్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.నరేంద్ర, నేచర్ ఎవెన్యూ డైరెక్టర్స్ వినోద్ రావు, రవికుమార్, సతీష్ లతోపాటు.. నేచర్ ఎవెన్యూ సిబ్బంది ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.
అక్టోబర్ 26 తన జన్మదినం సందర్భంగా నేచర్ ఎవెన్యూ టీమ్ మెంబెర్స్ సమక్షంలో సెలెబ్రేషన్స్ జరగడం చాలా సంతోషంగా ఉందని సోనీ అన్నారు. నేచర్ ఎవెన్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ముందు.. నేచర్ ఎవెన్యూ ఇన్ ఫ్రా తాజా వెంచర్ ‘యాదాద్రి యాంబియన్స్’ ను సోనీ చరిష్ఠ మరియు ప్రముఖ నటుడు లోహిత్ సంయుక్తంగా లాంచ్ చేశారు. ఈసందర్భంగా నేచర్ ఎవెన్యూ సిబ్బందికి లోహిత్ మరియు సోని చిరు జ్ఞాపికలు అందజేశారు. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన నేచర్ ఎవెన్యూ తాజా వెంచర్ ‘యాదాద్రి యాంబియన్స్’ కూడా పెద్ద స్థాయిలో సక్సెస్ అవుతుందని లోహిత్, సోని ఆకాంక్షించారు!!