చిన్న పిల్లలు బట్టలేసుకోడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. మారాం చేస్తుంటారు. ఇప్పుడు ఇషా గుప్తా కూడా ఇలాగే మారిపోయింది. ఈ భామకు కూడా క్యాస్టూమ్స్ అంటే మహా చిరాకు. కొందరు హీరోయిన్లు సినిమాలు చేస్తూ.. మధ్యమధ్యలో ఫోటోషూట్లు చేస్తుంటారు. ఇంకొందరు ఫోటోషూట్లు చేస్తూ సినిమాలు చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం కేవలం ఫోటోషూట్లతోనే అవాకాశాలు సంపాదిస్తుంటారు. ఇషాగుప్తా ఈ లిస్ట్ లోకి వచ్చే ముద్దుగుమ్మే. ఈమె తన అందాన్నంతా ధారపోస్తుంది. ఎంతలా అంటే.. బట్టలేసుకోవడమే మహాపాపం అన్నట్లుంది ఈషాగుప్తా తీరు చూస్తుంటే. అరె.. ఫోటోషూట్ చేసి చూపు తిప్పుకునే లోపు మరో హాట్ ఫోటోషూట్ తో మతులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. మ్యాగజైన్లపై ఫోజులివ్వడం తప్ప మరే పని పెట్టుకున్నట్లు కనిపించ ట్లేదు ఈషాగుప్తా. అడిగిందే తడువుగా అందరికీ అందాల విందు ఇచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. దమ్ముంటే కాస్కోండి అంటూ రెచ్చిపోతుంది. కొన్ని రోజుల నుంచి ఈమె చేస్తోన్న రచ్చకు సోషల్ మీడియా అంతా వేడెక్కిపోతుంది. అడిగితే అంతా నా యిష్టం అంటుంది. నా అందాలు చూసి తట్టుకోలేకపోతున్నారా అంటూ రివర్స్ అటాక్ చేస్తుంది. తాజాగా మరోసారి హాట్ హాట్ అందాలతో స్క్రీన్ ను షేక్ చేసింది ఈ భామ. ఈ మధ్యే తెలుగులో వీడెవడు సినిమాలో నటించింది ఈషాగుప్తా. అవకాశం వస్తే తెలుగులోనూ తన సత్తా చూపిస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈమె సెగలు ఎప్పటికి తగ్గేనో చూడాలిక..!