చూస్తుంటే నాగచైతన్యను పూర్తిగా నాగార్జున వదిలేసినట్లుగా కనిపిస్తుంది. ఆయన కెరీర్ లో సెట్ అయిపోయాడు. ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. ఒకట్రెండు హిట్లు గానీ పడితే చైతూ స్టార్ అయిపోయినట్లే. లేకపోయినా మీడియం రేంజ్ హీరోలా హాయిగా సెటిల్ అయిపోయాడు. అందులో నో డౌట్స్..
ఇప్పుడు ఈయన మార్కెట్ 15 నుంచి 20 కోట్ల మధ్యలో ఉంది. రెండు హిట్లు పడితే 30 కోట్లకు చేరడం ఖాయం. అందుకే ఇప్పుడు చైతూ విషయం పెద్దగా పట్టించుకోవడం లేదు నాగార్జున. తన ఫోకస్ మొత్తం చిన్న కొడుకు అఖిల్ పైనే పెడుతున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన అఖిల్.. హలో డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో ఎలాగైనా ఇప్పుడు అఖిల్ కు హిట్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు నాగ్. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరితో మూడో సినిమాను సెట్ చేసాడు.
ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ అఖిల్ నాలుగో సినిమా మాత్రం వర్మ దర్శకత్వంలో అని ఆ మధ్య అనౌన్స్ చేసారు. అది కూడా నాగార్జున నిర్మాణంలో.. ఇక్కడే అభిమానులు కంగారు పడ్డారు. పైగా ఆఫీసర్ చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిల్ ను తీసుకెళ్లి వర్మ చేతుల్లో పెట్టడానికి ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు అక్కినేని ఫ్యామిలీకి శివ తర్వాత ఇప్పటి వరకు మరో హిట్ ఇవ్వలేదు వర్మ. అంతం..
గోవిందా గోవిందా.. ప్రేమకథ.. మొన్నటికి మొన్న నాగచైతన్యతో బెజవాడ.. ఇప్పుడు ఆఫీసర్ ఇలా వర్మ అన్ని ఫ్లాపులే ఇచ్చాడు. దాంతో అఖిల్ సినిమాను ఆపేయాలని ఫిక్సైపోయాడు నాగార్జున. కథ ఇంకా చర్చల దశలోనే ఉందని మొన్న హింటిచ్చిన నాగ్.. ఇప్పుడు ఆఫీసర్ తర్వాత అది ఇంక ఎప్ప టికీ చర్చల్లోనే ఉంటుందని అర్థమయ్యేలా చెప్పేసాడు. దాంతో అక్కినేని అభిమానులు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.