తెలుగు రాష్ట్రాల్లో రానున్న వేసవి కాలం ఎప్పుడు లేనంత వేడిగా ఉండబోతుందని అంచనా. రాజకీయం గా వీచబోయే పెను మార్పు ‘పవనాలే’ ఇందుకు కారణమట. తాజా సమాచారం ప్రకారం 2018 మార్చ్ లో జన సేనాని పవన్ కళ్యాణ్ జనం లో కి రాబోతున్నారట. విజయవాడ లో నిన్న జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రరెడ్డి త్వరలో పవన్ కార్యచరణ కార్యక్రమాన్ని ప్రకటిస్తారని తెలిపారు. మీడియా ప్రతినిధి హరిప్రసాద్ మాట్లాడుతూ 2019 ఎలక్షన్ లలో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని, 60 నుండి 65 శాతం మంది కొత్తవారికే టికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. పవన్ 2019 ఎలక్షన్ లలో ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.
మరో వైపు పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న తన 25 వ చిత్రం ముందే నిర్ణయించినట్లు జనవరి 10 , 2018 కి రిలీజ్ అవుతుందని నిర్మాతలు కంఫర్మ్ చేసారు. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ లు గా మెరవనున్నారు. రెండు వారాల్లో యూరోప్ షెడ్యూల్ ప్రారంభిస్తామని, తర్వాత హైదరాబాద్ లో జరగబోయే ఫైనల్ షెడ్యూల్ తో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ దాదాపు ఖరారయినట్లే అని తెలుస్తుంది. ఈ వార్త తో ఫ్యాన్స్ ఉత్సాహానికి అంతేలేకుండా పోయింది. “అజ్ఞాతవాసం తరువాత మిగిలేది పట్టాభిషేకమేగా…రామాయణం లో అయినా, మహాభారతం లో అయినా.” అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మొదలుపెట్టేసారు.