ఈ మధ్య మెగా బ్రదర్స్ మధ్య మళ్లీ బాండింగ్ బాగా బలపడింది. మొన్నటికి మొన్న జనసేన పార్టీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు చిరు చాలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తుంది. తమ్ముడి మనసులో ఇంత బాధ దాగుందా.. ప్రజారాజ్యం కోసం ఇంతగా మదనపడ్డాడా అని తన సన్నహితులతో చెప్పి బాధ పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైమ్ లో తమ్ముడు ఏమడిగినా చేసేలా కనిపిస్తున్నాడు చిరంజీవి. ఇప్పటికే పవన్ పాడిన కొడకా కోటేశ్వరరావ్ పాట మెగాస్టార్ కు చాలా నచ్చిందని తెలుస్తుంది. తమ్ముడి వాయిస్ చాలా ఎనర్జిటిక్ గా ఉందని సన్నిహితులతో చిరంజీవి చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు తమ్ముడికి తన ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తున్నాడు మెగాస్టార్. అజ్ఞాతవాసి ప్రీమియర్ షోకు చిరంజీవి వస్తున్నాడని తెలుస్తుంది. జనవరి 8న చిరంజీవి కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లోనే అజ్ఞాతవాసి షో వేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చిరుతో పాటు ఈ షోకు ఆయన సతీమణి సురేఖ.. మెగా హీరోలు కూడా వస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. రాజకీయాల్లో బిజీ కానున్న పవన్ కు అజ్ఞాతవాసి చివరి సినిమా అని తెలుస్తుంది. దాంతో ఘనమైన ఫేర్ వెల్ ఇవ్వాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే మెగా కుటుంబం కూడా పవర్ స్టార్ వెంటే ఉన్నారు.