కొన్నిసార్లు వేరేవాళ్లు చేసే పని కూడా మనకు తిప్పలు తెచ్చిపెడుతుంది. ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు విక్రమ్ ను అడిగితే బాగా తెలుస్తుంది. అసలే ఈ మధ్య సరైన విజయాలు లేక అల్లాడిపోతున్నాడు ఈ శివపుత్రుడు. గెలుపుతో మజా చేసుకుని చాలా కాలమైంది ఈ మల్లన్న. ఇలాంటి టైమ్ లో ఈయన నుంచి ఓ బ్లాక్ బస్టర్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. సరిగ్గా ఈ సమయంలో తెలుగులో ఓ సినిమాతో వస్తున్నాడు విక్రమ్. వచ్చేదేదో హిట్ సినిమా కాదు.. రెండేళ్ల కింద తమిళనాట డిజాస్టర్ గా నిలిచిన సినిమాతో. అది కూడా తన కెరీర్ ను.. మార్కెట్ ను సగానికి పడేసిన సినిమాతో తెలుగులోకి వస్తున్నాడు విక్రమ్. అదే పత్తు ఎంద్రాకుల్లా. తెలుగులో 10 పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. సమంత హీరోయిన్ కావడంతో ఆమె క్రేజ్ వాడుకో డానికి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఇప్పుడిప్పుడే ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు. విజయ్ మిల్టన్ దర్శకుడు. సమంత హాట్ ఫోటోలన్నీ విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం తమిళనాట అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. మరి ఇలాంటి సినిమాతో తెలుగులోకి విక్రమ్ ఎందుకొస్తున్నట్లో ఆయనకే తెలియాలి. అన్నట్లు ఈ చిత్ర విడుదలకు విక్రమ్ కు ఎలాంటి సంబంధం ఉండదు. ఆ చిత్ర నిర్మాతలు తెలుగు హక్కుల్ని ఇక్కడి నిర్మాతలకు అమ్మేస్తారు. వాళ్లు విడుదల చేస్తారు. కానీ మధ్యలో బలైపోయేది మాత్రం విక్రమ్. ఇప్పుడు ఈయన మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ధృవనక్షత్రం.. సామి 2.. స్కెచ్ సినిమాలు చేస్తున్నాడు విక్రమ్. వీటిలో స్కెచ్.. ధృవనక్షత్రం విడుదలకు సిద్ధమయ్యాయి. మరి ఇప్పుడు వస్తున్న టెన్.. విక్రమ్ కు ఎలాంటి టన్ టనా టన్ అనిపిస్తుందో చూడాలిక..!