అనుష్కకు సినిమాలంటే ఇష్టం లేదా.. ఆసక్తి లేదా..? లేదంటే కెరీర్ ఇక చాలనుకుంటుందా..? ఇవన్నీ ఇప్పుడు ఈమె అభిమానులు వేస్తోన్న ప్రశ్నలే..! అనుష్క విషయంలో అసలేం జరుగుతుందో తెలియట్లేదు. సినిమాలు ఎందుకు ఒప్పుకోవడం లేదో.. ఎందుకు ప్రేక్షకుల ముందుకు రావడం లేదో అన్నీ చెప్పేసింది ఈ భామ. భాగమతి తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు అనుష్క. తాను సినిమాలకు దూరం కానున్న మాట అవాస్తవం అని.. అయితే బ్రేక్ మాత్రం తీసుకుంటున్నాని చెప్పింది ఈ భామ. ఆ మధ్య గౌతమ్ మీనన్ సినిమా ఒప్పుకున్నా అది ఎప్పటికి పట్టాలెక్కేనో ఆయనకే తెలియదు.
పైగా బరువు విషయంలోనూ ఇప్పటికీ అనుష్క అలాగే ఉంది. వయసు కూడా 36 ఏళ్లు రావడంతో కుర్ర హీరోలకు సరిపోయే ఫిజిక్ కాదు. స్టార్ హీరోలు కూడా అనుష్కతో రొమాన్స్ అంటే ఇప్పుడు ఎందుకులే అంటున్నారు. ఇప్పటికీ అనుష్క నార్మల్ అవతారంలోకి మారలేదు. ఆంటీలా మారిపోయింది. ఈ రూపంతోనే బాహుబలి 2, ఓం నమో వెంకటేశాయా, సింగం 3 షూటింగ్ పూర్తి చేసారు దర్శక నిర్మాతలు. అనుష్క బరువు తగ్గించడానికే బాహుబలి 2 లో స్పెషల్ గ్రాఫిక్స్ ను కూడా వాడుకున్నారు. ఇన్నాళ్లకు మళ్లీ అనుష్క భారీ సినిమాలు చేస్తుంది.
తనకు బాగా అచ్చొచ్చిన సూర్యతోనే మరో సినిమా చేయబోతుంది అనుష్క. అది కూడా సింగం టీం తోనే. హరి దర్శకత్వంలో సూర్య తర్వాతి సినిమా ఉండబోతుంది. ఇందులో హీరోయిన్ గా అనుష్కను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి జేజమ్మ కూడా సై అనేసింది. ఇప్పటికే సింగం మూడు సినిమాల్లోనూ ఈమె హీరోయిన్. అయితే ఇప్పుడు చేయబోయే సినిమా మాత్రం సింగం 4 కాదు.. ఫ్రెష్ సబ్జెక్ట్ అంటున్నాడు హరి. ఈ చిత్రంతో పాటు మళయాల సినిమాటోగ్రఫర్ కబీర్ అలీ దర్శకత్వంలో స్పానిష్ రీమేక్ జూలియస్ ఐస్ లోనూ జేజమ్మ నటించబోతుంది. ఈ సినిమాలతో పోయిన తన ఇమేజ్ ను మళ్లీ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది భాగమతి.