అనుష్క ఏం చేయాల‌నుకుంటుంది..?

BHAGAMATHI TRAILER VIEWS
అస‌లు సినిమాలు ఒప్పుకోవ‌డం లేదు.. అవ‌కాశాలు రావ‌ట్లేదా లేదంటే వ‌చ్చిన అవ‌కాశాలను ఆమె కాదంటుందా..? అనుష్క విష‌యంలో ఏం జ‌రుగుతుందో తెలియ‌క అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీలో చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. భాగ‌మ‌తి సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా ఒప్పుకోలేదు అనుష్క‌. భాగ‌మ‌తి కూడా ఎప్పుడో ఏడాది కింద సైన్ చేసిన సినిమా. అంటే అప్ప‌ట్నుంచి కూడా ఖాళీగానే ఉంది ఈ బ్యూటీ. ఒక్కోసారి కెరీర్ లో తీసుకునే నిర్ణ‌యాలు చాలా దారుణంగా ఉంటాయి. అవి పూర్తిగా కెరీర్ నే మార్చేసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు అనుష్క‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. క్రేజ్ చూస్తే ఆకాశ‌మంత ఉంది.. కానీ అవ‌కాశాలు మాత్రం రావ‌ట్లేదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇప్పుడు అనుష్క స్టార్ హీరోయిన్ కాదేమో అనిపిస్తుంది.
ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ నెక్ట్స్ ఏంటి అనే ఆలోచ‌నే అనుష్క‌కు రాలేదు. కానీ ఇప్పుడు ఫ‌స్ట్ టైమ్ వ‌చ్చింది. చేతిలో ఉన్న సినిమాల‌న్నీ అయిపోయి.. ప్ర‌స్తుతానికి ఖాళీగా ఉంది ఈ భామ‌. ద‌ర్శ‌కులే ఈమెను కాదంటున్నారా.. లేదంటే కాదను కుంటుందా అనే అనుమానం వ‌స్తుంది. పైగా అనుష్క కెరీర్ మొద‌లుపెట్టి ప‌దేళ్లు దాటేసింది. ఏ రోజు స‌న్న‌గా క‌నిపించ‌లేదు. అలా అని లావుగా ఎబ్బెట్టుగా కూడా మారిపోలేదు. యోగా బ్యూటీగా ఎలా ఉండాలో త‌న‌కు తెలుసు కాబ‌ట్టి అలాగే మెయింటేన్ చేసింది. కానీ ఒక్క సినిమా అనుష్క కొంప ముంచేసింది. అదే సైజ్ జీరో. ఈ సినిమా కోసం 100 కేజీలకు మారిపోయింది అనుష్క‌. గ్రాఫిక్స్ లో క‌వ‌ర్ చేసుకుందామంటే వ‌ద్దు న్యాచుర‌ల్ గా బ‌రువు పెరుగుతానంటూ ఒకేసారి అన్ని కేజీలు పెరిగింది అనుష్క‌. ఆ సినిమా వ‌చ్చి ఏడాది దాటినా.. ఇప్ప‌టికీ అనుష్క నార్మ‌ల్ అవతారంలోకి మార‌లేదు. ఆంటీలా మారిపోయింది. ఈ రూపంతోనే బాహుబ‌లి 2, ఓం న‌మో వెంక‌టేశాయా, సింగం 3 షూటింగ్ పూర్తి చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అనుష్క బ‌రువు త‌గ్గే వ‌ర‌కు చూస్తే త‌మ విడుద‌ల తేదీ ఆల‌స్యం అవుతుంద‌ని అంతా కాంప్ర‌మైజ్ అయిపోయారు.
ఈమెపై ఇంత ప్ర‌చారం జ‌రుగుతున్నా అనుష్క మాత్రం చాలా కూల్ గా ఉంది. ఇండ‌స్ట్రీ గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు.. అవన్నీ వూహలే అనను. అలాగని అన్నీ నిజాలు కూడా కావు. ఏ రంగంలో అయినా మంచీ చెడూ రెండూ ఉంటాయి. పాలు, నీళ్లు కలిపితే హంస పాలని మాత్రమే స్వీకరించగలదట. అలా మనం కూడా మారాలి. ఏది గ్రహించాలో, ఏది వదులుకోవాలో అనే విజ్ఞత మనకున్నప్పుడు చెడు గురించి భయపడడంలో అర్థం లేదు. ఓ సినిమా ఫ్లాప్‌ అయితే అంతా పోయినట్టు కాదు.. ఆ సినిమా ఎందుకు చేసానా.. అని కూడా బాధపడాల్సిన ప‌ని లేదు. ఆ సినిమాతో ఏదో నేర్చుకున్నాం అనేది తెలుసుకోవాలంటూ హిత‌బోధ చేస్తుంది ఈ జేజ‌మ్మ‌. అన్న‌ట్లు ఇప్పుడు భాగ‌మ‌తిలోనూ అనుష్క లావుగానే క‌నిపిస్తుంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 26న విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here