అదేంటి.. రంగస్థలంకు దూకుడుతో లింక్ ఏంటి అనుకుంటున్నారా..? ఉంది ఒక్క విషయంలో మాత్రం ఈ రెండు సినిమాలకు పోలిక ఉంది. రెండూ బ్లాక్ బస్టర్లే.. కొన్నిచోట్ల ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన సినిమాలే. జన్యూన్ విజయాలే. కానీ దర్శక నిర్మాతల అత్యుత్సాహానికి విమర్శల పాలైన సినిమాలు కూడా. అదేంటి అనుకుంటున్నారా..? ఇప్పటి వరకు రంగస్థలంను అంతా పొగిడిన వాళ్లే కానీ విమర్శించిన వాళ్లు లేరు.
కానీ ఇప్పుడు దర్శక నిర్మాతలు చేసిన చిన్న పని ఈ చిత్రానికి చెడ్డపేరు తీసుకొస్తుంది. అదే ఇండస్ట్రీ హిట్ అంటూ ప్రచారం చేసుకోవడం. 175 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.. బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ టిఎఫ్ఐ అంటూ పోస్టర్ విడుదల చేసారు రంగస్థలం టీం. తెలుగు సినిమా అతిపెద్ద విజయాల్లో రంగస్థలం కూడా ఒకటి. ఖైదీ నెం.150 రికార్డులను సైతం తిరగరాసింది ఈ చిత్రం. ఇది నిజమే కానీ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ టిఎఫ్ఐ మాత్రం కాదు. బాహుబలి అక్కడెవరికి అందని ఎత్తులో ఉంది. ఒకవేళ నిజంగానే అలా వేసుకోవాలని అనుకున్నపుడు నాన్ బాహుబలి అంటూ పోస్టర్ లో మెన్షన్ చేయాలి.
ఎక్కడో చిన్నగా ఎవరికి కనిపించని విధంగా వేసి.. బిగ్గెస్ట్ హిట్ అని పోస్టర్ విడుదల చేయడం మాత్రం కాస్త అత్యుత్సాహమే. అప్పుడు దూకుడు విషయంలోనూ ఇదే జరిగింది. ఇండస్ట్రీ హిట్ అని.. ఆల్ టైమ్ హిట్ అని ఏవేవో పోస్టర్లు విడుదల చేసారు. దాంతో దూకుడు అంత పెద్ద విజయం సాధించినా కూడా ఫేక్ రికార్డులు అంటూ అప్పట్లో రచ్చ జరిగింది. ఇప్పుడు రంగస్థలంకు కూడా ఇదే జరుగుతుంది. మరి ఇప్పటికైనా దర్శక నిర్మాతలు మాది నాన్ బాహుబలి అని చెబుతారో లేదో..?