అభిమ‌న్యుడు టైమ్ చూసి కొడుతున్నాడుగా..!

Vishal Abhimanyudu
ఇప్పుడు సినిమా చేయ‌డం కాదు.. దాన్ని విడుద‌ల చేసుకోవ‌డం కూడా తెలియాలి. లేదంటే అంతే సంగ‌తులు. ఈ విష‌యంలో విశాల్ కు చాలా క్లారిటీ ఉంది. ముందు త‌న సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని చూసాడు. కానీ అప్పుడు డేట్స్ ఫుల్ కావ‌డంతో అభిమ‌న్యుడు సినిమా జ‌న‌వ‌రి 26కి పోస్ట్ పోన్ అయింది. అప్పుడు అనుష్క న‌టించిన భాగ‌మ‌తి రానుంది.. అయినా కానీ త‌న సినిమాను విడుద‌ల చేస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమాలో జిఎస్టీ గురించి చాలానే చ‌ర్చ ఉండ‌బోతుంది. జిఎస్టీ.. ఇప్పుడు దేశంలో దీనికంటే పెద్ద చ‌ర్చ మ‌రేదీ లేదు. సామాన్య మాన‌వుడి నుంచి బిలీనియ‌ర్స్ వ‌ర‌కు అంద‌ర్నీ జిఎస్టీ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇదేంటి అని అడిగిన పాపానికి విజ‌య్ మెర్స‌ల్ సినిమాను కావాల్సిన‌న్ని తిప్ప‌లు పెట్టింది ప్ర‌భుత్వం. ఇప్పుడు దీనిపై మాట్లాడటానికి విశాల్ బ‌య‌ల్దేరాడు.
ఈయ‌న అలాంటిలాంటి హీరో కాదు.. భ‌యానికి మీనింగే తెలియ‌ని బ్ల‌డ్ ఆయ‌న‌ది. అత‌డే విశాల్. రెబ‌ల్.. పోటుగాడు.. అంటారు క‌దా.. అవ‌న్నీ విశాల్ కు ప‌క్కాగా సూట్ అవుతాయి. ఎవ‌రికీ త‌ల‌వంచ‌కు అన్న త‌ర‌హాలో దూసుకుపోతుంటాడు ఈ హీరో. రియ‌ల్ లైఫ్ కానీ.. రీల్ లైఫ్ కానీ తన‌కు అనిపించింది చేస్తూ పోతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతం విశాల్ ఇరుంబు తిరై అనే సినిమా చేస్తున్నాడు. మిత్ర‌న్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంపైనే ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తుంది. మిత్ర‌న్ ఈ చిత్రాన్ని పూర్తిగా జిఎస్టీకి వ్య‌తిరేకంగా తెర‌కెక్కించాడ‌నేది వినిపిస్తున్న వార్త‌.
దేశంలో ప్ర‌స్తుతం ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. డీమానిటైజేష‌న్ త‌ర్వాత జ‌రిగిన మార్పులు.. ప్ర‌జ‌ల అవస్థ‌లు ఇవ‌న్నీ ఇరుంబు తిరైలో ఉన్నాయని తెలుస్తోంది. న‌ల్ల‌ధ‌నం నిర్మూల‌న కోసం చేసిన డీమానిటైజేష‌న్ వ‌ల్ల దేశానికి లాభం ఏం జ‌ర‌గ‌లేద‌నేది కూడా సినిమాలో చూపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ విజువ‌ల్స్ చూస్తుంటే అందులో విశాల్ 2000 నోట్ల క‌ట్ట‌లు బోలెడు పెట్టుకుని ఉంటాడు. అర్జున్ ఇందులో విల‌న్. అభిమ‌న్యుడు పేరుతో తెలుగులో విడుద‌ల కానుంది ఈ చిత్రం. స‌మంత హీరోయిన్. అభిమ‌న్యుడు విడుద‌లైన త‌ర్వాత క‌చ్చితంగా జిఎస్టీ రచ్చ ఇంకా పెరుగు తుందనేది కొంద‌రి వాద‌న‌. మ‌రి మెర్స‌ల్ లో రెండు నిమిషాల డైలాగ్స్ ఉంటేనే సినిమాను విడుద‌ల కాకుండా.. అయిన త‌ర్వాత నానా తిప్ప‌లు పెట్టారు. ఇప్పుడు విశాల్ ఏకంగా మొత్తం జిఎస్టీపైనే ఓ సినిమా చేస్తున్నాడు. మ‌రి ఆయ‌న్ని ఏం చేస్తుందో ఈ బిజేపీ ప్ర‌భుత్వం..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here