“ఇటీవలి కాలంలో బంధాలు అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ కోవలోనే ఆకట్టుకోబుతున్న మరో ఆసక్తికర చిత్రమిది. తండ్రి -తనయల అనుబంధం నేపథ్యంలో ఉద్వేగభరితమైన కంటెంట్ తో తీస్తున్న చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తి రేకెత్తించింది. పెద్ద విజయం సాధిస్తుంది“ అన్నారు శ్రీకాంత్ అడ్డాల. గాళ్స్‌లో ఎమోషన్స్ బేస్ చేసుకుని, తండ్రి – తనయల బాంధవ్యంపై తెరకెక్కిస్తున్న సినిమా `అమ్మాయిలంతే .. అదో టైపు`. కృష్ణమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోపి వర్మ, మాళవిక మీనన్, శివాజీ రాజా ప్రధాన తారాగణం. గాయత్రి రీల్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ట్రైలర్ ఆవిష్కరించిన అనంతరం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.