అరెరే బెల్లంకొండ‌.. హీరోయిన్ల వ‌రాల కొండ‌.. 

Bellamkonda
ఇప్పుడు ఇండ‌స్ట్రీలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ను ఇలాగే పిలుస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల‌కు అయితే ఈ బాబు పంట పండిస్తున్నాడు. ఈయ‌న చ‌ల్ల‌ని చూపు పడిందంటే వాళ్ల బ్యాంక్ బ్యాలెన్స్ కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన‌ట్లే. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న న‌టించిన సినిమాల‌న్నింటిలోనూ స్టార్ హీరోయిన్లే ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇక‌పై కూడా సార్ త‌గ్గేలా క‌నిపించ‌ట్లేదు. కోటి ఎక్కువైనా ప‌ర్లేదు కానీ మినిమ‌మ్ స్టార్ కావాలంటున్నాడు. అల్లుడుశీనుతో స్టార్ హీరోల వార‌సులు కూడా ఈర్ష్య ప‌డే ఎంట్రీ ఇచ్చాడు శ్రీ‌నివాస్. ఆ సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ తొలి సినిమాలోనే స‌మంత‌, త‌మ‌న్నా లాంటి స్టార్ హీరోయిన్ల‌తో రొమాన్స్.. వివి వినాయ‌క్ లాంటి అగ్ర ద‌ర్శ‌కుడు.. ఫుల్ సెట‌ప్.. అంతా సాలిడ్ లాంచింగ్.. ఇలా ఎందులో త‌గ్గ‌లేదు బెల్లంకొండ  శ్రీ‌నివాస్. ఓవ‌ర్ బ‌డ్జెట్ కార‌ణంగా అల్లుడు శీను నిరాశ‌ప‌రిచింది కానీ ఆ సినిమాలో న‌టించిన స‌మంత‌, త‌మ‌న్నా.. తెర‌కెక్కించిన వినాయ‌క్.. ఇలా అంద‌రి పంట పండింది.
స‌మంత‌నే తీసుకోండి.. అప్ప‌టి వ‌ర‌కు కోటికి త‌క్కువ తీసుకునేది కాదు ఈ భామ‌. కానీ అల్లుడు శీనులో కొత్త హీరోతో న‌టించాల‌న‌గానే మ‌రో కోటి ఎక్కువ తీసుకుంది. ఇక త‌మ‌న్నా కూడా ఒక్క ఐటం సాంగ్ కు 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ చేసింది. ఇదంతా ముద్దుగుమ్మ‌ల‌కు బెల్లంకొండ వార‌సుడు ఇచ్చిన వ‌ర‌మే. ఆ త‌ర్వాత కూడా జ‌య జాన‌కి నాయ‌కాలో ర‌కుల్ ప్రీత్ తో జోడీ క‌ట్టాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. ఈ చిత్రం కోసం ఏకంగా కోటిన్న‌ర చ‌దివించాడు ఈ కుర్ర హీరో. ఇక ఇప్పుడు పూజాహెగ్డేతో రొమాన్స్ చేస్తున్నాడు. శ్రీ‌వాస్ సినిమా కోసం ఈయ‌న పూజాతో న‌టిస్తున్నాడు. ఇందులో న‌టించ‌డానికి పూజాకు కోటికి పైగా ఇచ్చారు.
ఇప్పుడు కాజ‌ల్ ను లైన్ లో పెడుతున్నాడు బెల్లంకొండ‌. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ రెడ్డితో బెల్లంకొండ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర స్క్రిప్ట్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. మార్చ్ 23న ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా కాజ‌ల్ ను అనుకుంటున్నారు. మ‌రో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఈమె కూడా స్టార్ కావాలంటున్నాడు ఈ కుర్ర హీరో. ఇదే జ‌రిగితే ఒకే సినిమాలో ఇద్ద‌రు స్టార్స్ తో జోడీ క‌ట్టిన హీరో అవుతాడు మ‌న బెల్లంకొండ‌. మొత్తానికి హీరోయిన్ల‌కు వ‌రాలివ్వ‌డానికి ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కామ‌ధేనువులా మారిపోయాడు అల్లుడు శీను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here