ఇప్పుడు ఓ పెద్ద సినిమా విడుదలైందంటే ఎలా ఉంది అని అడగడం కాదు.. మూడు రోజుల్లో ఎంత వచ్చింది..? ఎన్ని కొత్త రికార్డులు వచ్చాయని అడుగుతున్నారు. మొన్న రంగస్థలం.. భరత్ కూడా కొత్త రికార్డులు సెట్ చేసాయి. ఇక ఇప్పుడు సూర్య వచ్చాడు.. అదే మన బన్నీ వచ్చాడు. ఈ హీరో కూడా నా పేరు సూర్యతో కొత్త రికార్డులు సృష్టిస్తాడనే అనుకున్నారంతా. కానీ అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి.
ఈ చిత్రం తొలిరోజు 21 కోట్లు షేర్ వసూలు చేసింది.. ఆ తర్వాత రెండు రోజుల్లో 10 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 33 కోట్ల షేర్ వసూలు చేసాడు ఈ సూర్య. అయితే అల్లుఅర్జున్ రేంజ్ కు ఇవి చాలా తక్కువ వసూళ్లు. సినిమాకు టాక్ తేడాగా రావడం.. అవేంజర్స్ ఉండటం.. ఐపిఎల్ మ్యాచ్ లు.. పైగా ఎండ దంచి కొడుతుండటం.. ఇలా కర్ణుడి చావుకు లక్ష కారణలన్నట్లు..
నా పేరు సూర్యకు తక్కువ వసూళ్లు రావడానికి ఎన్నో కారణాలు. ఈ అడ్డంకులన్నీ దాటుకుని సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవర్సీస్ లో అయితే నా పేరు సూర్యకు రెస్పాన్స్ ఊహించినంతగా లేదు. ఇప్పటి వరకు అక్కడ మిలియన్ మార్క్ కూడా అందుకోలేదు. మొత్తానికి ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 80 కోట్లకు పైగా తీసుకురావాలి. మరి సూర్యకు అంత సత్తా ఉందా..? ఆ సూర్యుడితో పోటీ పడి ఈ సూర్యుడు అన్ని కోట్లు వసూలు చేస్తాడా..?