శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బస్టర్ అందించిన చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మించిన చిత్రం ఒక్క క్షణం. ఇటీవలే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఒక్క క్షణం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు – అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీరత్ కపూర్, కాశి విశ్వనాథ్, రోహిణి, జయప్రకాష్, ప్రవీణ్, సత్య, సుదర్శన్, వైవా హర్ష, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, బిల్లి మురళి, రవి వర్మ, శ్రీసుధ, చిత్రం భాషా, భిందు, ప్రణవ్, బద్రం తదితరులు నటించగా…
కో ప్రొడ్యూసర్స్ – సతీష్ వేగేశ్న, రాజేష్ దండ
సంగీతం – మణిశర్మ
డిఓపి – శ్యామ్ కె నాయిడు
డైలాగ్స్ – అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్ జి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ – నాగేంద్ర ప్రసాద్
క్రియేటివ్ హెడ్ – సంపత్ కుమార్
కో డైరెక్టర్ అండ్ అడిషనల్ డైలాగ్స్ – విజయ్ కామిశెట్టి
బ్యానర్ – లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత – చక్రి చిగురు పాటి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – విఐ ఆనంద్