రెండు పడవల మీద కాలు వేయడం అంటే ఇదేనేమో. ప్రజల తరుపున ప్రభుత్వాని ప్రశ్నించడానికి అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవర్ని ప్రశ్నిస్తున్నారు అని ఎవరికి అర్ధం కావట్లేదు. ఆ నాడు తెలుగు దేశం పార్టీ కి మద్దతు తెలిపి ఇప్పుడు అదే పార్టీ ని తిట్టడం లో పవన్ కళ్యాణ్ ఉదేశం ఏంటి, కెసిఆర్ ని తిట్టి పోసి ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీని పొగడడంలో దాగి ఉన్న మర్మం ఏంటి, అసలు అడుగుతా అన్న ప్రశ్నలని గట్టిగా నిలతీసి అడుగుతున్నారా.. న్యాయం కోసం పోరాడతా అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు పోరాడుతాడా అని అభిమానులు ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ అటువంటిది ఏమి చేయకుండా కొండగట్టు ఆంజనేయుడి సెంటిమెంటుతో ప్రారంభించి అనేక అనవసరమైన విషయాలు మాట్లాడటం జనాలను కన్ఫ్యూషన్ కు గురి చేస్తుంది. కొంత కాలం క్రితం వరకు ఉత్తరాది, దక్షిణాది మద్య ఉన్న వివక్ష గురించి ప్రసంగాలు చేసేవారు, ఆ తర్వాత మరో కొత్త పాయింట్ మీద ప్రసంగాలు చేయడం. ఇలా నిలకడ లేని ప్రయాణం ఎన్ని రోజులోసాగదు అని పవన్ కళ్యాణ్ గారు గమనించటం లేదు. ఏ పునాదుల మీద ఐతే పార్టీ ని స్థాపించారో ఆ పునాదులకే న్యాయం చేయడం లేదన్నది పొలిటికల్ విశ్లేషకుల వాదన. ఇప్పటికైనా మించింది లేదు ఒక్క సిద్ధాంతానికి కట్టుబడి ప్రచారం ముందుకు సాగించడం మంచింది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని మీకు ప్రజలకి ఒక అవగాహనా వస్తుంది అనేది తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ పిల్లలు కూడా అనుకుంటున్నారు!