ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద సెటైర్ లు వేశారు ప్రతిపక్షం నేత వై ఎస్ జగన్. పాదయాత్ర కు సిద్దమవుతున్న జగన్ మాట్లాడుతూ…చంద్రబాబు ప్రతి నెల కొన్ని తెలుగు చిత్రాలు చూస్తారని, వాటి లో వచ్చే అందమైన నగరాలను చూసి ఆంధ్ర రాజధాని అమరావతిని వాటి వాలే తీర్చిదిద్దుతామని ప్రగల్బాలు పలుకుతుంటారని. ఇంకా నయం, ముఖ్యమంత్రి హాలీవుడ్ ఇంగ్లీష్ చిత్రాలు చూడరు. అవి చూస్తే ఆ నగరాలతో కూడా అమరావతి పోల్చి చూపేవారని ఎద్దేవా చేసారు జగన్. గతంలో బాబు అమరావతిని టోక్యో ల తీర్చిదిద్దుతామని, సింగపూర్ లా చేసేస్తామని చెప్పిన విషయాన్నీ గుర్తుచేశారు జగన్.
![Chief minister doesn't watch Hollywood movies, says Jagan](http://temp.teluguodu.com/test/wp-content/uploads/2016/03/AP-CM.jpg)
అమరావతి లో ఇంత వరకు ఒక్క ఇటుక కూడా కదలలేదని, చంద్రబాబు కు సామాన్యుల కష్టాలు పట్టవని, రాష్ట్రంలో ఆడవాళ్లకు భద్రత లేదని, రిషితేశ్వరి లాంటి అమాయక ఆడపిల్లలు రాగ్గింగ్ బారిన పది చనిపోతే ముఖ్యమంత్రి ఏమి పట్టనట్లు ఉన్నారని, విజయవాడ లో జరిగే సెక్స్ రాకెట్లకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతుందని చెప్పారు జగన్. జనం తన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సుపరిపాలన ను మల్లి కోరుకుంటున్నారని. ఆ దిశగా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు జగన్.