ఈ రోజుల్లో ఓ సినిమా హిట్టా ఫట్టా అని చెప్పడానికి వారం రోజులు చాలు. ఇంకా మాట్లాడితే మూడు రోజులు వచ్చిన వసూళ్లను బట్టి ఈ సినిమా నిలబడుతుందా.. పోతుందా అని నిర్ణయిస్తున్నారు ప్రేక్షకులు. ఈ లెక్కలో ఈ నగరానికి ఏమైంది హిట్ ఫట్టా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తొలిరోజు వచ్చిన టాక్ బట్టి చూస్తే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే అనుకున్నారు. కానీ సినిమా క్రేజీగా ఉంటుంది..
నవ్వులకు గ్యారెంటీ ఉంది అనే టాక్ వచ్చిన తర్వాత కూడా ఏమైందో ఏమో ఈ నగరం ముందు నుంచి స్లోగానే మొదలైంది. అదే సాగించింది కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రం 5 కోట్లు కూడా వసూలు చేయకపోవడం విడ్డూరం. తరుణ్ భాస్కర్ ఇమేజ్ కూడా ఈ సినిమాకు పనికిరాలేదు.. ఫ్యామిలీ సినిమా కాదు అని ముందు నుంచే ప్రచారం జరగడంతో వాళ్లు థియేటర్స్ కు రాలేదు. దాంతో అక్కడే దెబ్బ పడిపోయింది. ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ తో పోలిస్తే ఈ నగరానికి ఏమైంది సేఫ్ ప్రాజెక్టే.. కానీ పెళ్లిచూపులు దర్శకుడి నుంచి వచ్చిన సినిమాగా చూస్తే మాత్రం ఈ నగరం హిట్ ఫ్లాపులకు మధ్యలోనే ఆగింది.