వి కె ఎ. ఫిలిమ్స్ సమర్పించు చిత్రం ఇగో( ఇందు-గోపి). ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు విజయ్ కరణ్,కౌషల్ కరణ్ మరియు అనిల్ కరణ్ కాగా దర్శకుడు సుబ్రమణ్యం ఆర్ వి. బుధవారం ప్రసాద్ ల్యాబ్ లో ఇగో చిత్ర టీజర్ ను డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మారుతి మాట్లాడుతూ ప్రెసెంట్ టైం లో చాలా పాశనేట్ ఉన్న దర్శకుడు ఉన్నాడంటే అది సుబ్రహ్మణ్యం. ఇతనికి తగ్గట్టే మంచి నిర్మాతలు దొరికారు. టీజర్ చూసినప్పుడే అర్థమయ్యింది సినిమా ఖచ్చితంగా బాగుంటుందని… నాకు బాగా నచ్చింది. ఆశిష్ నేటివిటీ తెలుగు కాకపోయినా అచ్చం ఆంధ్ర కుర్రాడిలా నటించాడు. హీరోయిన్ సిమ్రాన్ కొత్త అయినా అద్భుతంగా నటించింది.. టీం అందరికీ నా విషెస్ తెలుపుతున్నా అని అన్నారు. నిర్మాత కౌషల్ కరణ్ మాట్లాడుతూ ఇది మా బ్యానర్ లో వచ్చిన రెండో సినిమా… ఇగో చాలా అద్భుతంగా వచ్చింది. టీం అందరూ కష్టపడి పని చేశారు అని చెప్పారు. విజయ్ కరణ్ మాట్లాడుతూ టీజర్ విడుదల చేయడానికి విచ్చేసిన డైరెక్టర్ మారుతి గారికి కృతజ్ఞతలు. ఇగో సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుందని తెలిపారు. హీరో ఆశిష్ మాట్లాడుతూ మా మావయ్యాల బ్యానర్ లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేశాము. ఈ సినిమా వల్ల చాలా నేర్చుకున్నాను కూడా.. ఆకతాయి సినిమా లో నన్ను ప్రేక్షకులు ఎంకరేజ్ చేసినట్టుగానే ఈ ఇగో చిత్రాన్ని కూడా ఆదరిస్తారని భావిస్తున్నా అని అన్నారు. హీరోయిన్ సిమ్రాన్ మాట్లాడుతూ మంచి టీమ్ తో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉంది. లవ్లీ ప్రొడ్యూసర్స్. ఇంత మంచి సినిమాలో నేను కూడా భాగమైనందుకు హ్యాపీ గా ఉందని చెప్పారు. దర్శకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇండస్ట్రీలో నా మెంటర్ మారుతిగారు. ఆయన చేతుల మీదుగా టీజర్ లాంచ్ అయినందుకు సంతోషిస్తున్నా.. షూటింగ్ పూర్తయ్యింది. సినిమా చాలా బాగొచ్చింది. ఆశిష్, సిమ్రాన్ ఇతర నటీనటులు అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారు. దాదాపు 2రెండు సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికీ కథ చెబుతూ నిర్మాతల కోసం వెతుకుతున్నప్పుడు వి కె ఎ బ్యానర్ నిర్మాతలు నన్ను నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చారు. వీరు ఏ విధంగా అయితే నన్ను నమ్మారో అంతకంటే ఎక్కువ బాధ్యతగా పని చేసి రెట్టింపు నమ్మకంగా సినిమాను పూర్తి చేశాను… అదే స్థాయిలో ఇగో సినిమా ఫలితం కూడా ఉంటుంది అని చెబుతున్నా అన్నారు. ఇగో అనేది టైటిల్ లో ఉందికానీ పని చేసేటప్పుడు యూనిట్ అంతా ఎలాంటి ఈగోకు పోకుండా కష్టపడి పని చేశారని చెప్పారు ఎడిటర్ శివ.
అనిల్ కరణ్, రాజ్ కరణ్, తేజ్ దిలీప్, సుభాష్, అశోక్ కుమార్, స్నిగ్దా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
ఆశిష్ రాజ్, సిమ్రాన్, దీక్ష పంత్, రావు రమేష్, పోసాని, పృథ్వి, అజయ్, శకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: శివ వై ప్రసాద్, డీఓపీ: ప్రసాద్ జి. కె, స్టిల్స్: వికాస్, వి ఎఫ్ ఎక్స్: తేజ్ దిలీప్, మ్యూజిక్ డైరెక్టర్: సాయి కార్తీక్, ప్రొడ్యూసర్స్: విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్, కథ- డైరెక్షన్: సుబ్రహ్మణ్యం ఆర్.వి. (సుబ్బు).