రజినీకాంత్ సినిమా అంటే టాక్ తో పనిలేకుండా తొలి వీకెండ్ వసూళ్లు కుమ్మేయాలి. రికార్డులన్నీ తిరగరాయాలి. ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయిందా అంటే ఓకే.. కానీ అప్పటి వరకు మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టించాలి. లింగా.. కొచ్చాడయాన్.. కబాలి లాంటి సినిమాలు కూడా తొలి మూడు రోజులు రికార్డులు తిరగరాసాయి. కబాలి అయితే యావరేజ్ టాక్ తోనే తమిళనాట రికార్డులు తిరగరాసింది. ఆ చిత్రం మిగిలిన భాషల్లో ఫ్లాప్ కానీ తమిళ్ లో మాత్రం హిట్. అయితే ఇప్పుడు కాలా పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉంది.
ఈ చిత్రం నాలుగు రోజుల వీకెండ్ లో కేవలం 55 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇది చాలా అంటే చాలా తక్కువ వసూళ్లు. కబాలి మూడు రోజుల్లోనే 124 కోట్ల షేర్ వసూలు చేసింది. అంతెందుకు మొదటి రోజే ఆ సినిమా 56 కోట్ల షేర్ వసూలు చేసింది. కానీ కాలా నాలుగు రోజుల్లో కూడా అది సాధించలేదు. తెలుగులో 6.4 కోట్లు.. కర్ణాటకలో 5 కోట్లు.. కేరళలో 5.. తమిళనాట 43 కోట్ల గ్రాస్.. 32 కోట్ల షేర్ వసూలు చేసింది. యుఎస్ ప్లస్ ఓవర్సీస్ లో కలిపి 8 కోట్ల వరకు వచ్చింది.
ఓవరాల్ గా ఇప్పటి వరకు కనీసం 100 కోట్ల గ్రాస్ కూడా దాటలేదు ఈ చిత్రం. ఈ తీరు చూస్తుంటే లింగా కంటే పెద్ద డిజాస్టర్ గా కాలా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనికి రజినీ ఎలాంటి రీ ఫండ్ ఇస్తాడో చూడాలిక..!