ఇప్పుడు చూపిస్తున్నావా త్రిషా..? 

కొంద‌రు హీరోయిన్లకు వ‌య‌సు అస్స‌లు పెర‌గ‌దు. వాళ్లు వ‌చ్చి ఏళ్ల‌కేళ్లు గ‌డుస్తున్నా కూడా అవ‌కాశాలు వ‌స్తూనే ఉంటాయి. త్రిష కూడా ఇదే లిస్ట్ లో ఉంటుంది. 15 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టికీ హీరోయిన్ గానే కొన‌సాగుతుంది. అయితే ఒక‌ప్ప‌టిలా ఇప్పుడు స్టార్ హీరోల‌తోనే న‌టిస్తాననే ప‌ట్టుద‌ల లేదు. స్టార్ ఇమేజ్ ఉన్న‌పుడే నేను ఇలాంటి పాత్ర‌లు మాత్ర‌మే చేస్తాను.. ఇవి చేయ‌ను.. నాక‌వి కావాలి.. ఇవి కావాలి.. అని గొంతెమ్మ కోర్కెలు. ఒక్క‌సారి ఇమేజ్ పోయిందంటే ఇండ‌స్ట్రీలో వ్యాల్యూ కూడా పోతుంది. ఒక‌ప్పుడు దండేసిన వాళ్లే.. ఇమేజ్ లేక‌పోతే క‌నీసం దండం కూడా పెట్ట‌రు. హీరోయిన్ల విష‌యంలోనూ అంతే. స్టార్ హీరోయిన్ గా ఉన్న‌పుడు వాళ్లు చేసే వేశాలు అన్నీ ఇన్నీ కావు. ఆ భ్ర‌మ‌లోనే ఉంటూ కొన్నాళ్లూ అవ‌కాశాలకు కూడా దూర‌మ‌వుతారు.
త్రిష మాత్రం త‌న ఇమేజ్ ఏంటో ముందే తెలుసుకుంది. అందుకే చిన్న సినిమాలైనా ప‌ర్లేద‌ని అన్నింటికి ఓకే చెప్పేస్తుంది. ఆ చిన్న సినిమాల్లోనూ అందాల ఆర‌బోత రెచ్చిపోయి చేస్తోంది. ఆ మ‌ధ్య క‌ళావ‌తిలో బికినీలో సెగ‌లు పుట్టించిన త్రిష‌.. ఇప్పుడు మోహిని అనే మ‌రో సినిమాలో న‌టించింది. ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది, మ‌రోసారి హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ తోనే వ‌స్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఈ మ‌ధ్యే ఓ ఫోటోషూట్ కోసం ఏకంగా క్లీవేజ్ అందాల‌న్నీ బ‌య‌ట‌పెట్టేసింది. లేటు వ‌య‌సులో ఘాటుగా రెచ్చిపోయింది ఈ చెన్నైచంద్రం. ప్ర‌స్తుతం త్రిష కెరీర్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఆ మ‌ధ్య కొన్ని అవ‌కాశాలు అందుకున్నా.. ప్ర‌స్తుతం మాత్రం త‌న కెరీర్ ను నిల‌బెట్టే అవ‌కాశాల కోసం వేచి చూస్తుంది. అందుకే ఈ అందాల ఆర‌బోత కూడా. మ‌రి ఇది చూసిన త‌ర్వాతైనా ఈ చెన్నై చిన్న‌దాన్ని ఏ ద‌ర్శ‌కుడో క‌రుణించ‌క‌పోతాడా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here