ఏమైందో ఏమో గానీ చిన్నపిల్లలు సడన్ గా స్కూల్ కు వెళ్లడం మానేసినట్లు.. ఇలియానా కూడా ఈ మధ్య బట్టలేసుకోవడం మానేసింది. అవును.. మీరు చదివింది నిజమే. ఈ మధ్య పూర్తి క్యాస్ట్యూమ్స్ కంటే కూడా కేవలం బికినీ ఉంటే చాలు అనుకుంటుంది ఇల్లీబేబీ. హాయిగా గోవా బీచ్ తో పాటు ఇంకా ఇతర దేశాలు తిరిగేస్తూ సందడి చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ హొయలు చూసి బాపురే అనుకుంటున్నారు ప్రేక్షకులు కూడా.
ఇదంతా దర్శక నిర్మాతలకు తాను సిద్ధంగా ఉన్నాను.. ఇంకా అందాలన్నీ అలాగే ఉన్నాయంటూ సిగ్నల్స్ పంపించినట్లుగానే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఓ బికినీ ఫోటోతో రచ్చ చేసింది ఇలియానా. అయితే తర్వాత ఏం అనుకుందో ఏమో కానీ వెంటనే తీసేసింది కూడా. ఆ పెట్టడం ఎందుకో.. మళ్లీ తీసేయడం ఎందుకో గానీ అది ఇలియానాకే తెలియాలి మరి. ప్రస్తుతం ఈమె తెలుగులో రవితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. అప్పుడెప్పుడో ఆరేళ్ల కింద తెగదెంపులు చేసుకుని వెళ్లిపోయింది బాలీవుడ్ కు.
అక్కడే కాపురం పెట్టేసింది. కానీ ఇప్పుడు అక్కడ అవకాశాలు రావట్లేదు. విజయాలున్నా పట్టించుకునేవాడు లేడు. దాంతో ఇప్పుడు మళ్లీ మెల్లగా చూపు తెలుగు ఇండస్ట్రీ వైపు మళ్లించింది. శీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తుంది. ముందుగా ఇందులో అను ఎమ్మాన్యువల్ ను అనుకున్నా..
ఈ భామ బయటికి వెళ్లిపోయింది. దాంతో ఇల్లీబేబీ వచ్చేసింది. గతంలో రవితేజతో కలిసి కిక్.. ఖతర్నాక్.. దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో నటించింది ఇలియానా. ఇన్నాళ్లూ ఇలియానా ఎక్కడుందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు సడన్ గా ఈమె ఫోటోలన్నీ దర్శనమిస్తున్నాయి. ఇదంతా ఆమె ప్రీ ప్లాన్ గా కనిపిస్తుంది. ముందు నా ఫోటోలు చూడండి.. నన్ను గుర్తు పెట్టుకోండి.. అప్పుడు నేనొస్తా అన్నట్లుంది ఇలియానా వాలకం. మొత్తానికి మరి చూడాలిక.. జఘన సుందరి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో..?