కూర్చున్న కొమ్మను ఎవరైనా నరికేసుకుంటారా..? అంత పిచ్చి పని అయితే ఎవరూ చేయరు కానీ ఇప్పుడు ఇలియానా మాత్రం అదే చేస్తుంది.. కాదు కాదు చేసింది కూడా. ఇన్నాళ్లూ సౌత్ ఇండస్ట్రీపైనే నోరు పారేసుకుంటుంటే బాలీవుడ్ లో మెప్పు కోసమేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు బాలీవుడ్ పై కూడా అమ్మాయిగారు నోటి దురుసు చూపించారు. అక్కడ హీరోలు కామాంధులు అంటూ పెద్దపదాన్ని వాడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఇలియానా కమెంట్స్ పై బాలీవుడ్ లో సంచలనం రేగుతుంది. అసలు సౌత్ నుంచి వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ అవకాశాలు ఇస్తే మన హీరోలనే అలా అంటుందా అంటూ ఇలియానాపై ఫైర్ అవుతున్నారు అభిమానులు. తాజాగా ఈమె రైడ్ సినిమాలో నటించింది. మార్చ్ 16న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగానే కాంట్రవర్సీ కమెంట్స్ చేసింది ఇలియానా. సౌత్ లో దర్శకులు కేవలం హీరోయిన్ల అందాలను మాత్రమే చూస్తారంటూ ఈ మధ్యే కమెంట్ చేసిన ఇల్లీబేబీ.. ఇప్పుడు బాలీవుడ్ పై ఓ అడుగు ముందుకేసింది. ఇక్కడ హీరోలు అంత మంచివాళ్లే కాదని.. చాలా మంది అవకాశాలు ఇస్తాం.. పడక గదికి రమ్మంటూ ఓపెన్ గానే అడుగుతారు.. అంత కామాంధులు ఉన్నారంటూ సంచలనం సృష్టించింది ఇలియానా. ఈ విషయం తనతో పాటు చాలా మంది హీరోయిన్లకు కూడా తెలుసు కానీ కాకపోతే చెప్తే కెరీర్లు ముగిసిపోతాయి అనే భయంతోనే ఎవరూ చెప్పడం లేదంటుంది ఇలియానా. హాలీవుడ్ లో స్టీన్ హార్వే బండారం ఎలాగైతే బయట పెట్టారో అలాగే ఇక్కడ కూడా హీరోయిన్లంతా కలిసి క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడాలంటూ కోరింది ఇలియానా. మొత్తానికి ఇప్పుడు ఈ భామ చేసిన కమెంట్స్ అన్నీ రచ్చ రచ్చ చేస్తున్నాయి బాలీవుడ్ లో.