బిందుమాధవి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. ఇక్కడ చాలా సినిమాల్లో నటించింది కానీ క్రేజ్ మాత్రం రాలేదు. ఆవకాయ్ బిర్యాని లాంటి క్లాస్ సినిమాతో వచ్చి.. బంపర్ ఆఫర్ లో ఏకంగా బికినీ వేసి అందాల ఆఫర్ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే కోరుకున్న బ్రేక్ మాత్రం రాలేదు. తెలుగులో నో బోర్డ్ పెట్టేసరికి.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ సుడి కలిసొచ్చి కొన్ని సినిమాలు చేసింది. చిన్న హీరోలతో బాగానే నటించింది. అందులో కొన్ని విజయాలు కూడా ఉన్నాయి. కానీ అమ్మడి సుడి మాత్రం తిరగలేదు. దాంతో చాలా రోజుల పాటు కనిపించకుండా అయిపోయింది బిందు. మళ్లీ ఇన్నాళ్ళ తర్వాత సడన్ గా అందాల బంపర్ ఆఫర్ ఇస్తూ వచ్చింది ఈ భామ. ఉన్నట్లుండి అందాలన్నీ కెమెరా ముందు ఆరబోసింది. ఈ ఫోటోషూట్ చూసిన తర్వాతైనా ఎవరో ఓ దర్శకుడు కరుణించకపోతాడా అని చూస్తుంది బిర్యానీ పాప.