ఏంటో కొన్ని సినిమాలకు అన్నీ ముందు నుంచే అలా కలిసొస్తుంటాయి. ఇప్పుడు ఎంసిఏ సినిమాకు కూడా అంతే. నాని హీరో అనగానే సినిమాకు సగం బలం వచ్చేసింది. ఇక సాయిపల్లవి కూడా తోడయ్యేసరికి సినిమాపై ఎక్కడలేని నమ్మకాలు వచ్చేసాయి. ఇప్పుడు మ్యూజిక్ లో కూడా తన వంతు సాయం చేస్తున్నాడు దేవీ శ్రీ ప్రసాద్. ఇప్పటికే విడుదలైన ఎంసిఏ ఆడియో సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు వీడియో సాంగ్స్ కూడా విడుదలయ్యాయి. తాజాగా విడుదలైన కొత్తగా కొత్తగా ప్రోమో సాంగ్ అయితే కేక పెట్టిస్తుంది. వరంగల్ లోనే అద్భుతమైన విజువల్స్ ను కెమెరా కంటితో చూపించాడు సమీర్ రెడ్డి. శ్రీమణి రాసిన ఈ పాటలో నాని, సాయిపల్లవి తమ రొమాన్స్ తో మరింత అందం తీసుకొచ్చారు. సాగర్ ఎనర్జిటిక్ వాయిస్.. ప్రియా హిమేష్ రొమాంటిక్ స్వరం.. ఇప్పుడు విడుదలైన విజువల్స్ తో ఈ పాట బాగానే మెస్మరైజ్ చేసింది. వరంగల్ వేయి స్థంభాల గుడితో పాటు మిగిలిన ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరించాడు దర్శకుడు వేణు శ్రీరామ్. మొత్తానికి ఎంసిఏ మ్యూజిక్ పరంగా సూపర్ హిట్. వరంగల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా సాగుతుంది.