పవన్ కళ్యాణ్ మళ్ళి తండ్రైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం అయన భార్య అన్నా లెజ్నేవ మగ బిడ్డ ను ప్రసవించారు. అభిమానులు సంబరాలు జర్పుకుంటుంటే మరో వైపు ప్రత్యర్థులు ఇదే అదనుగా తీసుకుని పవన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని ప్రచారం చేయ సాగారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్ధికి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండ కూడదనే నిబంధన ఉన్న విషయాన్నీ వారు గుర్తుచేస్తున్నారు. పవన్ కు మాజీ భార్య రేణు దేశాయ్ తో ఇద్దరు పిల్లలు అకిరా, ఆధ్య ఉండగా, అన్నా తో ఇదివరకే పొలేనా అనే కూతురు ఉండటంతో ఆయనకు మొత్తం నలుగురు సంతానం కావడం వల్ల ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హుడని ప్రత్యర్థుల వాదన. అయితే ఇన్ని రోజులు గుర్తుకు రాని విషయం ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందని పవన్ అభిమానులు, అనుచరులు విశ్లేషిస్తూ సామజిక మాధ్యమంలో ఓ వ్యాసాన్ని ప్రచురించారు, అది వైరల్ అవుతుంది. మీరు చదవండి…
“2014 ఎలక్షన్ లలో టీడీపీ, బీజేపీ పార్టీల తరపున ప్రచారంచేసి పరోక్షంగా వారు అధికారంలోకి రావడానికి సాయం చేసినప్పుడు, పొత్తు కొనసాగించినంత వరకు సైలెంట్ గా ఉన్న వారు నేడు పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యర్థి అవుతాడనగా హఠాత్తుగా ఏమిటీ మార్పు, ఎందుకీ ఉలికిపాటు.
పవన్ కు జనం లో వస్తున్న అమోఘమైన ఆదరణ చూసి ఓర్వలేక ఇటువంటి ప్రచారానికి పాల్పడుతున్నారని, ఏ విధమైన పదవి లేక పోయినా నిజాయితీగా ప్రజల సమస్యలకోసం పోరాటం చేస్తున్న పవన్ కి ఎత్తి చూపడానికి ఏ మచ్చ లేక పోవడంతో వారు వ్యక్తిగత విషయాలను తెర పైకి తెస్తున్నారు. ప్రజా రాజ్యం విషయంలో ను ఆ నాడు ఇదే జరిగిందన్న సంగతి గుర్తు చేసుకోవాలి. అప్పుడప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేసిన మెగా స్టార్ చిరంజీవికి ఎటువంటి అవినీతి మరకలు లేకపోవడంతో కొత్త పార్టీ లోకి కోవర్టులను ప్రవేశపెట్టి ఎం. ఎల్.ఏ టికెట్లు అమ్ముకున్నారని అపవాదు సృష్టించి పార్టీ పతనానికి దారితీసారు.
ఇప్పుడు జన సేన విషయంలో కూడా అదే కుట్ర చేస్తున్నారన్నఅనుమానాలు కలగకమానదు. అయితే ప్రజలు ఇటువంటి రాజకీయ వికృత క్రీడలతో విసిగిపోయారని, పవన్ ను ప్రజల సమస్యలూ, హక్కులకోసం ప్రభుత్వాన్ని నిలదీసే ఓ నాయకుడి గా ఆహ్వానించారు. ఇక 2019 లో ఓ రాజకీయ శక్తి గా కూడా పవన్ ఎదిగితే, ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో అని ఆలోచిస్తున్నారే తప్ప ఆయనకు ఎంత మంది భార్యలు ఎంతమంది సంతానం అనే వ్యక్తిగత విషయాలు పట్టించుకునే పరిస్థితి లేదు. కుతంత్రాలకు చిరంజీవి లా తప్పుకోడు, సవాలని సమర్ధవంతంగా తిప్పికొట్టే పవర్ ఉన్నవాడు ఈ జన సేనాని.
ఎనబయ్యేళ్ళ వయసులో నందమూరి తారక రామారావు గారు లక్ష్మి పార్వతి ని పెళ్లి చేసుకున్నా ప్రజలు 1995 ఎన్నికల్లో ఆయన్ను గెలిపించారు. అంటే ప్రజలు నేతలను ఎన్నుకొనేటప్పుడు వారి లో ని మంచిని చూస్తారు, మనకి మంచి చేసే సత్త ఉందా లేదా అనేదే చూస్తారు తప్ప వ్యక్తిగత లోపాలను పట్టించుకోరు అని తెలుస్తుంది. అదే విధంగా చిత్ర రంగంలో అశేష అభిమానులను సాధించి రాజకీయాల్లో మార్పుకు నాంది పలికిన పవన్ కళ్యాణ్ కు కూడా ప్రజలు బ్రహ్మరధం పట్టడం ఖాయం, ఎవరెన్ని ఎత్తుగడలేసిన 2019 ఎన్నికల్లో జన సేన ప్రభంజనం తథ్యం.”