ఎమ్మెల్యే మ‌రో ప‌టాస్ అవుతుందా..?

MLA Movie
ఏమో ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. మ‌నోడు ఈ చిత్రంపై ఎక్క‌డ‌లేని న‌మ్మ‌కాల‌న్నీ పెట్టుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సినిమా గురించి చాలా గొప్ప‌గా చెప్పాడు క‌ళ్యాణ్ రామ్. సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తీ టెక్నీషియ‌న్ గురించి మ‌రిచిపోకుండా మాట్లాడాడు. ఈ చిత్రం క‌చ్చితంగా త‌న‌కు మ‌రో ప‌టాస్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు ఈ హీరో. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ కెరీర్ కు విజ‌యం కూడా కీల‌కం. ప‌టాస్ త‌ర్వాత ఈయ‌న‌కు స‌క్సెస్ రాలేదు. మ‌ధ్య‌లో వ‌చ్చిన యిజం.. షేర్ అంచ‌నాలు అందుకోలేదు. యిజంకు టాక్ బాగానే వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్ల‌లో అది క‌న్వ‌ర్ట్ కాలేదు. దాంతో ఇప్పుడు క‌చ్చితంగా క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం కోసం చూస్తున్నాడు ఈ హీరో. ఎమ్మెల్యేలో కాస్త పొలిటిక‌ల్ ట‌చ్ కూడా ఉంటుంది. ఇందులో ఓ రాజ‌కీయ నాయ‌కుడితో ఓ కుర్రాడు స‌వాల్ చేసి ఎలా ఎమ్మెల్యే అవుతాడు అనేది క‌థ‌. ఆగ‌డు లాంటి సినిమాల‌కు రైట‌ర్ గా ప‌నిచేసిన ఉపేంద్ర మాధ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రాన్ని అక్ష‌రాలా 15 కోట్ల‌కు అమ్మారు. మిగిలిన రైట్స్ తో క‌లిపితే 22 కోట్ల‌కు ఈ చిత్రాన్ని బిజినెస్ చేసారు. అంటే క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొడితే త‌ప్ప ఎమ్మెల్యే సేఫ్ అవ్వ‌దు. ఈ లెక్క‌న ప‌టాస్ కాదు.. దాన్ని మించిపోవాలి ఈ ఎమ్మెల్యే. చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..? మార్చ్ 23న సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here