ఈ రోజుల్లో పాటలు ఎవరు వింటున్నారు.. అసలు పాటల్లో అర్థాలు ఎక్కడ ఉంటున్నాయి అన్నీ ట్యూన్సే కదా.. అర్థం కాని పాటలన్నీ వస్తున్నాయి కథ ఉండే పాటలే లేవు అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. ఇలాంటి టైమ్ లో మొన్నొచ్చిన రంగస్థలం అభిప్రాయం మార్చాయి. ఇప్పుడు భరత్ అనే నేను కూడా ఇదే చేస్తున్నాయి.
కథ అంతా పాటల్లో చెప్పేస్తున్నారు దర్శకులు. ఇక లిరిక్ రైటర్స్ కూడా దర్శకుల అభిప్రాయాలకు బాగా లోబడి రాస్తున్నారు. మొన్న విడుదలైన భరత్ అనే నేను తొలిపాట పూర్తిగా రాజకీయాలను ఉద్దేశ్యించి రాసింది. అందులో లిరిక్స్ సరిగ్గా ఉంటే సినిమాలో సిఎం అయిన తర్వాత మహేశ్ ఏం చేయాలనుకున్నాడో అర్థమవుతుంది.
ఇక ఇప్పుడు విడుదలైన ఐ డోంట్ నో పాట మాత్రం మహేశ్ వ్యక్తిత్వాన్ని గురించి చెబుతుంది. పాటలో ఇంగ్లీష్ మరీ ఎక్కువైపోయింది. ట్యూన్ కూడా మల్లీశ్వరి సినిమాలోని నువ్వెంత అందగత్తెవైనా గానీ అనే పాటను గుర్తు చేస్తుంది. అయితే పాట మాత్రం బాగానే ఉంది.
బాలీవుడ్ దర్శకుడు, హీరో ఫర్హాన్ అక్తర్ వాయిస్ పాటకు భలే సెట్ అయ్యింది. ఇక రామ జోగయ్య శాస్త్రి కూడా దర్శకుడు చెప్పిన సందర్భాన్ని చక్కగా అర్థం చేసుకుని అద్భుతంగా రాసాడు. యూనివర్స్ అనే ఎన్ సైక్లోపీడియాలో తెలుసుకున్న కొద్దీ వుంటాయి ఎన్నెన్నో… ఆర్ట్ అఫ్ లివింగ్ అంటే ఆర్ట్ అఫ్ లెర్నింగ్ అంతే..
నాకు తెలిసింది ఓ కొంత తెలియంది ఇంకెంతో.. ఐ డోంట్ నో.. ఓన్లీ వన్ థింగ్ ఐ నో.. దేర్ ఈజ్ సొ మచ్ టు నో అంటూ సాగే ఈ పాటలో చాలా ఇన్ స్పిరేషన్ ఉంది. ఈ పాట ఒక్కసారి వింటే సినిమాలో మహేష్ పాత్ర వ్యక్తిగత జీవితం గురించి తెలిసిపోతుంది. జాలీగా లైఫ్ ఎంజాయ్ చేసే మహేశ్ వచ్చి సిఎం కుర్చీలో కూర్చుంటాడు. ఈ చిత్రం ఎప్రిల్ 20న విడుదల కానుంది. మరి చూడాలిక.. మహేశ్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో..? ఈ చిత్రం ఎలా ఉండబోతుందో..?