రామ్ చరణ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేదు. యావరేజ్ సినిమాలు.. ఫ్లాప్ సినిమాలు కూడా ఇక్కడ దుమ్ము దులిపేసాయి. ఓపెనింగ్స్ వరకు చరణ్ కిరాక్. తన మాస్ ఇమేజ్ తో రచ్చ రచ్చ చేస్తుంటాడు. ఇంట గెలిచినా రచ్చ మాత్రం ఇప్పటికీ గెలవలేకపోయాడు చరణ్. ఓవర్సీస్ లో ఈయన సినిమాలు కనీసం పట్టించుకోరు.
అక్కడ నాని కంటే తక్కువ మార్కెట్ ఉంది చరణ్ కు. ఇన్నాళ్లూ ఎన్ని విజయాలు సాధించినా ఇది మాత్రం తీరని కోరికగా.. అందని ద్రాక్షగానే ఉండిపోయింది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. రంగస్థలంతో ఈయన రచ్చ రచ్చ చేస్తున్నాడు విదేశీ బాక్సాఫీస్ ను.
అక్కడ తొలిరోజు ప్రీమియర్స్ తో కలిపి ఏకంగా 1.2 మిలియన్ అందుకున్నాడు. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటే మిలియన్ మార్క్ సినిమా ఉంది చరణ్ కెరీర్ లో. అదే ధృవ.. అది కూడా విడుదలైన వారం రోజుల తర్వాత కానీ మిలియన్ మార్క్ అందుకోలేదు
. అలాంటిది ఇప్పుడు తొలిరోజే మిలియన్ డాలర్ సాధించేసాడు. దీన్ని బట్టి సినిమా రచ్చ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. దానికితోడు ఇప్పుడు సినిమాలే లేవు పోటీకి. దాంతో రంగస్థలం ఈజీగా రికార్డుల దుమ్ము దులపడం ఖాయంగా కనిపిస్తుంది. రెండో రోజు కూడా హాఫ్ మిలియన్ కంటే పైనే వసూళ్లు వచ్చేసాయి. దీన్నిబట్టి మూడు రోజుల్లోనే మ్యాజికల్ 2 మిలియన్ మార్క్ అందుకునేలా కనిపిస్తుంది రంగస్థలం.
ఇదే జరిగితే నాన్ బాహుబలి కేటగిరీలో ఇంత ఫాస్ట్ గా 2 మిలియన్ మార్క్ అందుకున్న సినిమాగా రంగస్థలం చరిత్ర సృష్టించడం ఖాయం. అంతేకాదు.. అన్నీ కుదిర్తే 3 మిలియన్ కూడా రంగస్థలం అందుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఇన్నాళ్లూ వేచి చూసినా.. ఒకేసారి బాగా గట్టిగా కొట్టాడు దెబ్బ.