జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ నలభైఎనిమిదిలోజరిగిన ఒక పేలుడులో ఒక ఇల్లు ద్వంసం అయింది. ఒక పారిశ్రామికవేత్త ఇక్కడ ఇల్లు నిర్మిస్తున్నారు. అక్కడ ఉన్న పెద్ద,పెద్ద రాళ్లను తొలగించడానికి ఆయన జిలెటిన్ స్టిక్స్ వాడారు. పేలుడు తీవ్రతకు దగ్గర్లోని ఒక ఇల్లు కూలిపోయింది.పోలీసులు అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. భారీ పేలుడుతో ఏమి జరిగిందో అర్దంకాక జనం ఆందోళన చెంది పరుగులు పెట్టారు.