ఇప్పుడు లెంతీ సినిమాలకు టైమ్ బాగా నడుస్తుంది. అంటే మూడు గంటల సినిమాలు అన్నమాట. రంగస్థలం.. భరత్ అనే నేను.. మహానటి ఇలా అన్నీ మూడు గంటల సినిమాలే. ఇక ఇప్పుడు కాలా కూడా దాదాపు అదే నిడివితో వస్తుంది. ఈ చిత్రం రెండు గంటల 45 నిమిషాలతో వస్తుంది. అయితే రంగస్థలంతో పాటు మిగిలిన రెండు సినిమాల్లో కావాల్సినంత కంటెంట్ ఉంది. మనసుకు హత్తుకునే ఎమోషన్స్ ఉన్నాయి.
కాబట్టే అంత సేపు ఉన్నా కూడా చూసారు. కాలాలో కూడా ఇవి ఉండాల్సిందే.. మరో ఆప్షన్ లేదు. అలా కాకుండా సహనానికి పరీక్ష పెడతాం అంటే మాత్రం ఫలితం మరోలా ఉడటం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే కబాలిలో ఓ సారి అలా జరిగింది. ఆ చిత్రం మూడు గంటలకు 10 నిమిషాలు తక్కువగా వచ్చింది. అంతసేపు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడలేకపోయారు. తమిళ్ లో ఏదో రజినీ ఇమేజ్ తో ఆడేసింది కానీ తెలుగులో మాత్రం డిజాస్టరే.
మరి ఇప్పుడు కాలా కూడా అంతే నిడివితో వస్తుంది. ఈ సారి ఏం చేస్తాడో..? ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. అన్నట్లు తెలుగులో ఇప్పటి వరకు ఈ చిత్ర బిజినెస్ జరగలేదు. నిర్మాతలు 40 కోట్లు అడుగుతుండటంతో ఎవరూ ముందుకు రావడం లేదు. చివరివరకు ఏం జరుగుతుందో చూడాలిక..!