చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఉంటుందా..? ఉండదుగా.. ఇప్పుడు కాలా పరిస్థితి కూడా అంతే. ఈయన సినిమా ఇప్పడు కర్ణాటకలో విడుదలైంది. ఒక్కరోజే కదా ఆలస్యంగా విడుదల అయింది.. ఇప్పుడు ఏమైంది విడుదలైంది కదా ఎప్పుడో ఓ సారి అని సర్దుకోవాలా..? అలా చేస్తే నిర్మాతలకు ఇప్పుడు మునిగిపోవడం తప్ప మరో ఆప్షన్ లేదు. దానికి పక్కా కారణం కూడా ఉంది. ఎందుకంటే కాలా సినిమాకు తొలి రోజే యావరేజ్ టాక్ వచ్చింది. తమిళనాట ఈ టాక్ తో ఓకే కానీ ఇతర ఇండస్ట్రీల్లో మాత్రం కాదు.
రజినీకాంత్ ఉన్నా కూడా స్లోగా సాగడం కాలాకు మైనస్ గా మారింది. ఇప్పుడు కర్ణాటకలో విడుదలైనా కూడా ఈ టాక్ ప్రభావం భారీగా పడుతుంది. సాధారణంగా తొలిరోజు కర్ణాటకలో రజినీ సినిమాలకు 5 నుంచి 7 కోట్ల ఓపెనింగ్ వస్తుంది. కానీ కాలాకు మాత్రం 2 కోట్ల వరకు కూడా వచ్చేలా కనిపించట్లేదు. దానికి నెగిటివ్ టాక్ కారణం. పైగా రజినీపై ఉన్న కోపం కూడా ఈ చిత్ర కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుంది. మొత్తానికి కర్ణాటకలో ఆలస్యంగా విడుదల కావడం కాలాకు ఇప్పుడు శాపంగా మారింది.