రజినీకాంత్ సినిమా అంటే టాక్ తో పనిలేకుండా తొలి వారం వసూళ్లు కుమ్మేయాలి. రికార్డులన్నీ తిరగరాయాలి. ఆ తర్వాత సినిమా ఫ్లాపైందా.. లేదా అనే ముచ్చట్లన్నీ..! అప్పటివరకు అయితే కలెక్షన్ల సునామీ సృష్టించాలి కదా. లింగా.. కొచ్చాడయాన్.. కబాలి లాంటి సినిమాలు కూడా తొలి మూడు రోజులు రికార్డులు తిరగరాసాయి. కబాలి అయితే యావరేజ్ టాక్ తోనే తమిళనాట రికార్డులు తిరగరాసింది.
ఆ చిత్రం మిగిలిన భాషల్లో ఫ్లాప్ కానీ తమిళ్ లో మాత్రం హిట్. అయితే ఇప్పుడు కాలా పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్ రిపోర్ట్ వచ్చింది. ఇది చూస్తే రజినీకాంత్ రేంజ్ ఎంతగా పడిపోయిందో అర్థమైపోతుంది. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 165 కోట్లకు అమ్మితే కనీసం అందులో సగం 80 కోట్లు కూడా రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రజినీకాంత్ సినిమాల్లో ఇది చాలా అంటే చాలా తక్కువ వసూళ్లు.
కబాలి మూడు రోజుల్లోనే 124 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫైనల్ రన్ 280 కోట్ల వరకు తీసుకొచ్చింది. కానీ కాలా మాత్రం 120 కోట్ల గ్రాస్.. 75 కోట్ల షేర్ మాత్రమే తీసుకొచ్చి డబుల్ డిజాస్టర్ గా నిలిచింది. లింగా కంటే పెద్ద డిజాస్టర్ గా కాలా అవతరించింది. మరి దీనికి రజినీ రీ ఫండ్ ఇస్తాడో లేదో చూడాలిక..!