సినిమా సినిమాకు మార్కట్ పెంచుకుంటూ వెళ్లిపోతున్నాడు నిఖిల్. ఈయన ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింట్లోనూ ఎక్కువగా వసూలు చేసిన సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా. ఈ చిత్రం దాదాపు 15 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది. దాంతో ఇప్పుడు కిరాక్ పార్టీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్ర బిజినెస్ 10 కోట్లు.. మిగిలిన నాన్ థియెట్రికెల్ బిజినెస్ మరో 5 కోట్లు చేసింది. అంటే మొత్తంగా 15 కోట్లకు ఈ చిత్రాన్ని అమ్మేసారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే సినిమాపై ఫుల్ పాజిటివ్ టాక్ ఉంది. సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కావడంతో ఆసక్తి కూడా అదే రేంజ్ లో కనిపిస్తుంది. శివతో పాటు హ్యాపీడేస్ కూడా గుర్తొచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు శరణ్ కొప్పిశెట్టి. కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రంపై ఇక్కడ కూడా అదే అంచనాలున్నాయి. ఒరిజినల్ ను అలాగే తీసుకుని.. కాస్త మార్పులు చేసి కిరాక్ పార్టీని తెరకెక్కించాడు శరణ్ కొప్పిశెట్టి. దీనికి చందూమొండేటి డైలాగులు.. సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే బోనస్. కేవలం స్నేహంకోసం తమ స్థాయి తగ్గించుకుని నిఖిల్ కోసం స్క్రీన్ ప్లే, మాటలు రాసారు ఈ దర్శకులు. మొత్తంగా ఇప్పుడు కిరాక్ పార్టీ ముందు ఊరించే లక్ష్యం ఉంది. ఇది 15 కోట్లకు పైగా వసూలు చేసిందంటే బ్లాక్ బస్టర్ కా బాప్ అనిపించుకుంటుంది. హిట్ అనిపించుకోవాలన్నా కూడా 10 కోట్లకు పైగానే వసూలు చేయాలి. ఏం చేయాలన్నా నిఖిల్ కెరీర్లో హైయ్యస్ట్ వసూళ్లు సాధించాలి. అప్పుడే సినిమా సేఫ్ అవుతుంది. మార్చ్ 16న కిరాక్ పార్టీకి పోటీగా కర్తవ్యం సినిమా విడుదలవుతుంది. మరి చూడాలిక.. కిరాక్ పార్టీ అంచనాలు అందుకుంటుందో లేదో..?