ఈ రోజుల్లో సినిమాను పోలిన సినిమాలు రావడం కామన్. ఏ సినిమాలోనూ మనకు కొత్త సీన్స్ అయితే కనిపించవు. కచ్చితంగా ఓ సినిమాను మరో సినిమాతో పోల్చుకోవాల్సిందే. ఇప్పుడు విడుదలైన కిరాక్ పార్టీ ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఇదే అనిపిస్తుంది. ఈ చిత్రం అచ్చంగా హ్యాపీడేస్ ను తలపిస్తుంది. ఆ సినిమాలో కనిపించిన సీన్లే ఇందులోనూ కనిపిస్తున్నాయి. శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రానికి చందూమొండేటి డైలాగులు రాసాడు.. సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందించాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన కిరిక్ పార్టీకి రీమేక్ ఇది. ఈ చిత్ర ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు కచ్చితంగా పెరగడం ఖాయం. అయితే హ్యాపీడేస్ ఛాయలు మాత్రం చాలానే కనిపిస్తున్నాయి. అవే గొడవలు.. అవే ప్రేమలతో పాటు అదే ఫ్లేవర్ కూడా ఉంది. దాంతో కిరాక్ పార్టీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల అని ముందు చెప్పారు.. కానీ ట్రైలర్ లో మాత్రం డేట్ చెప్పకుండా కమింగ్ సూన్ అన్నారు. అంటే డేట్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.