వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్. కే. రోజా టీడీపీ ప్రభుత్వాని విమర్శించారు, చంద్రన్న మాల్స్ ప్రజలకోసం లేక చంద్రన్న కోసమా, చంద్రన్న మాల్స్ పేదోడికి భారమే తప్ప దానివల్ల ప్రజలకి ఉపయోగం ఉండదు అని అన్నారు.బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గితే హెరిటేజ్లో ఎవరూ కొనరని ముఖ్యమంత్రికి భయం పట్టుకుందన్నారు. అలాగే చంద్రబాబుకు వాటాలున్న ప్యూచర్ గ్రూపుకు రేషన్ దుకాణాల ఆధునీకరణ కాంట్రాక్టు ఇచ్చారన్నారు.
చంద్రన్న మాల్స్ మొదటి దశలో విజయవాడ గుంటూరు లో ప్రారంభిస్తున్నారు అందులో 6500 మాల్స్ పెట్ ఆలోచనలో ఉన్నారు.
చంద్రన్న మాల్స్ పేరుతో దోపిడీ చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పథకం వేసిందని వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్. కే. రోజా ఆరోపించారు. బుధవారం ఆమె విలేకరుతో మాట్లాడుతూ… చంద్రన్న మాల్స్తో పేదలకు ఒరిగేదేం లేదన్నారు. పేదోడికి నిత్యవసర సరుకులు దూరం చేయడమేగాక 300 శాతం భారం వేస్తున్నారని ఆమె ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గితే హెరిటేజ్లో ఎవరూ కొనరని ముఖ్యమంత్రికి భయం పట్టుకుందన్నారు. అలాగే చంద్రబాబుకు వాటాలున్న ప్యూచర్ గ్రూపుకు రేషన్ దుకాణాల ఆధునీకరణ కాంట్రాక్టు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలన్న చిత్తశుద్ది లేదని రోజా విమర్శించారు.