సొంత కూతురిని కూడా చంపడానికి వెనకాడని తండ్రికి ఉరిశిక్ష పడింది. భారత దేశంలో ఇలాంటి తీర్పు మొదటిసారి వచ్చింది అని చెపుకోవచ్చు. పరువుహత్య కేసు లో ఒకేసారి ఆరుగురికి ఉరిశిక్ష పడింది.తమిళనాడు లోని తిరుప్పూరు జిల్లా ఉడుమలై పేటలో ఉండే కౌసల్య, శంకర్‌లు ప్రేమించుకున్నారు, పెద్దలు ఒప్పుకోకపోవడంతో పెద్దలని ఎదిరించి పెళ్లిచేసుకున్నారు. అది అవమానంగా భావించి కౌసల్య తండ్రి కిరాయి గూండాలతో హత్యకు ప్లాన్ చేయించాడు. 13 మార్చ్ 2016 న రోడ్ మీద వెళ్తున్న జంటని గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ వాహనం మీద వచ్చి కొడవలి తో నరకగా అందులో కౌసల్య భర్త చనిపోయారు, కౌసల్య మాత్రం గాయాలతో బయట పడింది, ఈ కేసును పోలీసులు 11 మందిని కోర్టులో హజరుపరిచారు. అందులో కౌసల్య తల్లితండ్రులు అన్నలక్ష్మి, చిన్నసామి, మేనమామ పాండిదురై ఉన్నారు. మేజిస్ట్రేట్ కార్టు 21 నెలల విచారణ తర్వాత తల్లిని మేనమామ ని వదిలేయగా తండ్రికి మాత్రం రెండు ఉరిశిక్షలు విధించింది . చిన్నస్వామికి శిక్ష తగించమని కోరగా తగ్గించే ప్రసక్తే లేదు అని సొంత కూతురిని చంపాలనుకున్న తండ్రికి ఇదే సరైన శిక్ష అని, ఇటువంటివాళ్లు సమాజానికి మాయని మచ్చ అని జడ్జిగారు ఆగ్రహపడరు