సాధారణంగా ఏ సినిమాలో అయినా ఎవరైనా చనిపోతే ఎలాంటి మ్యూజిక్ వస్తుంది..? అప్పటి వరకు ఉన్నది కాకుండా పూర్తిగా స్యామ్ మ్యూజిక్ తో తన టాలెంట్ అంతా చూపిస్తుంటాడు సంగీత దర్శకుడు. ఆర్ఆర్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. కానీ కాలాలో మాత్రం చాలా భిన్నం. ఇక్కడ రంజిత్ పైత్యం అనాలో ఏమో కానీ ఓ మనిషి చనిపోయిన తర్వాత దానికి ర్యాప్ పెట్టాడు రంజిత్.
అది అసలు ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. సినిమాలో కీలకమైన సన్నివేశాల్లో కూడా చాలా వెకిలిగా ర్యాప్ పాడుతుంటే దాన్ని చూసి ప్రేక్షకులు నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేక పోతున్నారు. ముఖ్యంగా రజినీ భార్య, కొడుకు చనిపోయినపుడు వెనక నుంచి ర్యాప్ వస్తుంటే ప్రేక్షకులకు చిరాకు కాదు.. చెర్రెత్తుకొస్తుంది. దర్శకుడు కొత్తగా ఆలోచించొచ్చు.. కానీ మరీ ఇంత క్రియేటివిటీగా మాత్రం కాదు.
మనుషులు చచ్చిపోయిన సీన్స్ లో కూడా ర్యాప్ ఏంటో కానీ అది రంజిత్ కే తెలియాలి మరి..! ఈయన గత సినిమాల్లోనూ ఆ బ్యాచ్ ఉంటుంది. అయితే కాలాలో మాత్రం ఇలాంటి సీన్స్ ఎక్కువగా కనిపించాయి. థియేటర్స్ లో కూడా ఈ సీన్స్ వచ్చినపుడు రెస్పాన్స్ చాలా సెటైరికల్ గా ఉంది. మరి ఈ రెస్పాన్స్ రంజిత్ దృష్టి వరకు వెళ్తాయో లేదో చూడాలిక..!