చందమామకు అప్పుడప్పుడూ గ్రహణం పడుతుంది కదా.. అలాగే మన చందమామ కూడా అప్పుడప్పుడూ చిక్కిపోతుంది అన్నమాట. ఇక్కడ చందమామ అంటే కాజలే. ఈ భామ గురించే ఇప్పుడు డిస్కషన్ అంతా. కాజల్ కు ఏమైంది.. బాగానే ఉంది కదా.. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అనుమానం అనుకుంటున్నారా..? ఒక్కసారి కాజల్ ను సరిగ్గా చూస్తే ఎందుకు ఈ అనుమానం వచ్చిందో అర్థమైపోతుంది. నిన్నమొన్నటి వరకు బొద్దుగా ముద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు పీలగా మారిపోయింది. కొవ్వు మొత్తం కరిగించి మెరుపుతీగలా మారిపోయింది. ఉన్నట్లుండి ఇలా జీరోసైజ్ లోకి మారిపోవడానికి కారణమేంటో తెలియదు కానీ కాజల్ మాత్రం చాలా చిక్కింది. మొన్నటి వరకు కూడా కాజల్ మరీ లావుగా ఏం లేదు కానీ కచ్చితంగా బొద్దుగా మాత్రం ఉంది.
ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ అంతలోనే ఇలా బరువు తగ్గిపోయింది. కాజల్ ఈ ప్రయత్నాలు బాలీవుడ్ కోసమేనా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే కాజల్ బాలీవుడ్ పై ఆశలు వదిలేసుకుంది. ఉన్నన్ని రోజులు ఇక్కడే సౌత్ లో హాయిగా స్టార్ హీరోయిన్లా ఉండాలని ఫిక్సైపోయింది. మరి ఇప్పుడు బరువు తగ్గడం మాత్రం కుర్ర హీరోలో నటిండానికి అని తెలుస్తుంది. ఈ మధ్య సీనియర్ హీరోలే కాజల్ కు ఎక్కువగా ఆఫర్లు ఇస్తున్నారు. దాంతో కుర్రాళ్లకు సెట్ కావాలంటే ఫిజిక్ లో మార్పు తప్పనిసరి అని అర్థం చేసుకుంది చందమామ. అందుకే ఉన్నట్లుండి ఈ బరువు తగ్గే ప్రోగ్రామ్ పెట్టుకుంది. ఈ మధ్యే ఓ ఈవెంట్ కు వచ్చిన కాజల్ ను చూసి అంతా షాక్ అయ్యారు. అమ్మాయిగారేంటి ఇంత చిక్కిపోయారు అని. మొత్తానికి చూడాలిక.. కాజల్ కథలు ఎక్కడ ముగుస్తాయో..?