చిరంజీవికే అప్పు ఇచ్చేంత నిర్మాత ఇండస్ట్రీలో ఎవరున్నారు..? అయినా అసలు ఆయనకు అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముంది..? కోరితే చిరుకు కోట్లు ఇచ్చేవాళ్లున్నారు కదా.. అయినా 5 వేల కోసం చిరు ఎవరి దగ్గర చేయి చాచారు.. అసలు అంత అసవరం ఏమొచ్చింది అనుకుంటు న్నారా..? ఏం చేస్తాం.. ఇది జీవితం కదా.. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అలాగే చిరంజీవి ఇప్పుడు అంటే మెగాస్టార్ కానీ ఆయన కెరీర్ తొలి రోజుల్లో కష్టాల గురించి ఇప్పుడు ఆయన తనయుడు రామ్ చరణ్ చెప్పాడు. హ్యాపీవెడ్డింగ్ ఆడియో వేడుకలో చరణ్ ఈ విషయాన్ని చెప్పాడు. ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు.
నిహారిక హీరోయిన్. ఈ వేడుకలో చరణ్ చాలా విషయాలను ఫ్యాన్స్ కు చెప్పాడు. నాన్నగారు కెరీర్ తొలి నాళ్లలో కష్టపడుతున్న రోజుల్లో.. ఓ నెలలో కనీసం 5 వేలు కూడా లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఓ నిర్మాత ఆయన్ని అదుకున్నారు. అతడే అయ్యప్పరాజు.. మన ఎమ్మెస్ రాజు గారి తండ్రి ఆయన. అలా మన కుటుంబాన్ని రాజుగారి కుటుంబం ఆదుకుందని తనకు నాన్నగారు చెప్పారని గుర్తు చేసుకున్నాడు రామ్ చరణ్. తాను హ్యాపీవెడ్డింగ్ ఆడియో వేడుకకు వచ్చింది కూడా నిహారిక కోసం కాదు.. రాజుగారి కోసమే అని చెప్పాడు చరణ్. మొత్తానికి అప్పుడు తీసుకున్న అప్పు చిరు తీర్చేసాడో లేదంటే రుణం కోసం అలాగే ఉంచుకు న్నాడో..?