అతడు సినిమాలో ఎమ్మెస్ నారాయణ చెప్పిన డైలాగే గుర్తొస్తుంది ఇప్పుడు శృతిహాసన్ తీరు చూస్తుంటే. చూపించి చూపించకుండా శృతిహాసన్ కూడా ఇప్పుడు టార్చర్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమాలకు పూర్తిగా దూరమైన శృతి.. ఫిజిక్ పై కూడా పట్టు కోల్పోయింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల వైపు అడుగేస్తుంది ఈ భామ. దాంతో షేప్ లతో షేకులతో షాకులిస్తుంది.
ఈ మధ్య అసలు బయట కనిపించడమే మానేసిన ఈ భామ.. తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. అది కూడా నిండుగా కప్పుకుని. ఈ భామను చూసి బాబోయ్ ఏంటి శృతిహాసన్ ఏంటి ఇంతగా మారిపోయింది..? అసలు అందాలు ఆరబోయకుండా ఫోటోషూట్ చేసిందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం హిందీలో విద్యుత్ జమాల్ సినిమా తప్ప మరో సినిమా ఏది సైన్ చేయలేదు ఈ ముద్దుగుమ్మ.
తెలుగులో రవితేజ సరసన నటించాలని కోరినా కూడా ఒప్పుకోలేదు శృతి. అయితే త్వరలోనే తెలుగు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చే సన్నాహాలు చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోషూట్ దానికి సన్నాహకంగా కూడా అయ్యుండొచ్చు మరి. మరోవైపు తండ్రి రాజకీయ పార్టీ పనులను కూడా దగ్గరుండి చూసుకుంటుంది శృతి. మరి ఒకేసారి ఇన్ని పనులను శృతి ఎలా చక్కబెట్టుకుంటుందో చూడాలిక..!