చూపుల‌తోనే చంపేస్తున్న కీర్తి.. 

అందంగా క‌నిపించ‌డం అంటే కేవ‌లం అందాలు ఆర‌బోయ‌డమేనా..? ఎక్స్ పోజింగ్ చేయ‌క‌పోతే అందంగా క‌నిపించ‌న‌ట్లేనా..? ఇప్పుడు ఇండ‌స్ట్రీలో అంద‌రూ అనుకుంటున్న మాట ఇదే. కానీ ఇది త‌ప్ప‌ని కొంద‌రు ముద్దుగుమ్మ‌లు నిరూపిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి ఏం చూపిస్తుంద‌ని స్టార్ గా మారిపోతుంది.. నివేదా థామ‌స్ ఎక్స్ పోజింగ్ చేస్తుందా.. అంతెందుకు కీర్తిసురేష్ క‌నీసం న‌డుము అయినా చూపిస్తుందా..? అయినా కానీ స్టార్ హీరోయిన్ కాలేదా..? మ‌రీ ముఖ్యంగా కీర్తిసురేష్ అయితే కేవ‌లం క‌ళ్ళ‌తోనే చంపేస్తుంది. మిగిలిన వాళ్లు బికినీ వేసినా కూడా ఆ మ‌త్తు వ‌స్తుందో రాదో తెలియ‌దు కానీ కీర్తి క‌ళ్ల‌లోనే ఏదో మాయ ఉంది.
కీర్తిసురేష్ అందాలు ఆర‌బోయ‌దు.. ఎక్స్ పోజింగ్ చేయ‌దు.. కానీ మోడ్ర‌న్ డ్ర‌స్సులేస్తుంది.. చూపుల‌తోనే చంపేస్తుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి.. మ‌హాన‌టి.. విక్ర‌మ్ సామి 2.. విశాల్ పందెంకోడి 2 సినిమాల్లో న‌టిస్తుంది. వీటితోపాటు సూర్య తాన సేరంద కూట్టంలోనూ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రంలోని ఓ పాట‌ను ఈ మ‌ధ్యే విడుద‌ల చేసారు. ఇందులో అందాలు ఆర‌బోయ‌క‌పోయినా.. హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ తోనే చంపేసింది కీర్తిసురేష్. మోడ్ర‌న్ డ్ర‌స్సులు వేసి చూపించకుండానే రెచ్చ‌గొట్టేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇన్నాళ్లూ ఎన్ని సినిమాలు చేసినా.. క‌నీసం న‌డుము కూడా చూపించ‌లేదు కీర్తిసురేష్. మొత్తానికి గ్లామ‌ర్ మాత్ర‌మే ఏలుతున్న ఇండ‌స్ట్రీలో చూపించ‌కుండానే చంపేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here