ఈ రోజుల్లో రంగస్థలం లాంటి సినిమాను తెరకెక్కించడమే గొప్ప సాహసం. ఇలాంటి సినిమాలు చూస్తారని కూడా ఎవరూ ఊహించలేదు. నిజానికి సుకుమార్ కూడా ఇదే అన్నాడు. తను ఇన్నాళ్లూ ప్రతీ హీరోను సూపర్ స్టైలిష్ గా చూపించి ఒక్క చరణ్ ను మాత్రమే ఇలా చూపించడానికి కారణం కూడా ఇదే అన్నాడు. ఎందుకో ఇన్నాళ్లూ చరణ్ లోని కారెక్టరైజేషన్ ను వాడుకునేలా ఎవరూ ఇప్పటి వరకు సినిమాలు తీయలేదని.. అంతా మాస్ ఇమేజ్ పైనే దృష్టి పెట్టారని చెప్పాడు సుకుమార్. అందుకే తాను కొత్తగా ఉంటుందని.. ఓ ప్రయోగం టైప్ లో చేసానని చెప్పాడు ఈ దర్శకుడు. సక్సెస్ అయింది కాబట్టి సంతోషంగా ఉన్నాడు సుకుమార్.
రంగస్థలం సాధించిన విజయం చూసి సుకుమార్ ఈ కథపై ఎంత నమ్మకం ఉందో అనుకున్నారంతా. కానీ తనకు ఈ చిత్ర కథపై కొంత నమ్మకం లేదని తానే ఒప్పుకున్నాడు. ముఖ్యంగా ఇందులో హీరోకు చెవుడు ఉంటుంది.. అందుకే చెవిటి మిషన్ పెట్టుకోమని హీరోకు చెబుతాడు దర్శకుడు. నిజానికి ఈ సీన్స్ విషయంలో తనకే క్లారిటీ లేదని చెప్పి షాక్ ఇచ్చాడు సుకుమార్. ఓ స్టార్ హీరోకు ఇలా చెవిటి మిషన్ పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అనే విషయంపై చాలా కాలం పాటు తాను ఆలోచించానని.. తను చరణ్ కు చెప్పిన వెంటనే మరో మాట లేకుండా పెట్టుకోవడం చూసి షాక్ అయిపో యానని చెప్పాడు ఈ దర్శకుడు.
తనపై అంతగా నమ్మకం ఉంచిన చరణ్ కు కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఏం చేయగలనని చెప్పాడు ఈ దర్శకుడు. అసలు అలా పెట్టుకుంటే అది క్లిక్ అవుతుందా లేదా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.. ప్రేక్షకులను మెప్పించగలదా లేదా అనే విషయాలపై తనకే క్లారిటీ లేదని చెప్పాడు సుకుమార్. థ్యాంక్స్ మీట్ లో తన మనసులోని మాటలన్నీ బయటికి చెప్పాడు ఈ దర్శకుడు. దర్శకుడిగా తనకు పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత కానీ హీరోకు చెప్పకూడదు. కానీ తనకే నమ్మకం లేకుండా ఈ సీన్స్ అన్నీ చరణ్ తో చేయించి తనను మోసం చేసానని చెప్పాడు సుకుమార్. అయితే దీనికి ఇప్పుడు వస్తోన్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉందన్నాడు సుకుమార్. మొత్తానికి మోసం చేసినా కూడా అంతా బాగానే ఉంది.