వై.ఎస్.జగన్ పాదయాత్ర కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ఆం చేయబోయే ఈ పాద యాత్ర ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లలగుండా సుమారు 125 కిలోమీటర్ పొడవునా సాగనుంది. మార్గ మధ్యలో సేదతీరేటందుకు, రాత్రుళ్ళు విశ్రాంతి తీసుకొనేటందుకు టెంపోరరీగా నిర్మించే ఇల్లు ఏర్పాటుచేస్తున్నారు. ఏ.సి., టీవీ, ఫ్రిడ్జ్ వంటి అన్ని సౌకర్యాలతో అత్యాధునిక వసతి గృహాలు ప్రతి 20 కిలోమీటర్లకొకటి ఏర్పాటుచేస్తున్నారట.
వీటికి టైట్ సెక్యూరిటీ కూడా ఉంటుందట. మార్గమంతా కటౌట్లు, బ్యానెర్ల తో నిండిపోనున్నాయి. వీటన్నింటికయ్యే ఖర్చు మొత్తం వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ భరిస్తుందట. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి 2004 లో పదవినధిష్టించిన విషయం తెలిసిందే. మరి జగన్ కూడా తన తండ్రి అడుగుజాడల్లో నడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారో లేదో చూడాలంటె 2019 వరకు ఆగాల్సిందే.