జనవరిలో విడుదలకు సిద్ధమైన “శరభ”  

ఏ.కె.ఎస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఆకాష్ కుమార్ ను హీరోగా పరిచయం చేస్తూ ఎన్.నరసింహారావు తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ “శరభ”. అశ్వని కుమార్ సహదేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో “చిన్నదాన నీకోసం” ఫేమ్ మిస్తీ చక్రవర్తి కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటీమణి జయప్రద, నెపోలియన్, నాజర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. భారీ స్థాయిలో సీజీ వర్క్ మరియు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్స్, ఫైటర్స్ తో తెరకెక్కించబడిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. జనవరిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఆశ్వనికుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. “అత్యద్భుతమైన కథ-కథానాలతో వి.నరసింహారావు “శరభ” చిత్రాన్ని తెరకెక్కించారు. ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతోపాటు.. హాలీవుడ్ టెక్నీషియన్స్ చేసిన ప్రోస్తెటిక్ మేకప్, సీజీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. చిరంజీవిగారు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు దిల్ రాజు రిలీజ్ చేసిన టీజర్ కి భారీ స్పందన లభించింది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జనవరిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. కోటి గారు సమకూర్చిన బాణీలు, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటాయి. అలాగే రమణ సాల్వ కెమెరా వర్క్ ఆడియన్స్ ను విస్మయానికి గురి చేస్తుంది. ఇలా టాప్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేసిన “శరభ” చిత్రం  ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతినిచ్చే విధంగా ఉండబోతోంది. అలాగే.. ఒక డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించగా ఓ డెబ్యూ హీరో నటించిన “శరభ” హిందీ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం” అన్నారు.
పునీత్ ఇస్సార్, తనికెళ్ళభరణి, ఎల్.బి.శ్రీరామ్, పోంవన్నన్, సాయాజీ షిండే, అవినాష్, పృథ్వీ, చంద్రదీప్, రాకింగ్ రాకేష్, దువ్వాసి మోహన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: వేదవ్యాస్-రామజోగయ్యశాస్త్రి-అనంతశ్రీరాం-శ్రీమణి, ప్రోస్తెటిక్ మేకప్: సీన్ ఫూట్, మేకప్: నాయుడు-శివ, కళ: కిరణ్ కుమార్ మన్నే, ఫియట్స్: రామ్-లక్ష్మణ్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, డిజైనర్స్: అనిల్-భాను, ఆడియోగ్రఫీ: లక్ష్మీనారాయణన్ ఏ.ఎస్, సినిమాటోగ్రఫీ: రమణ సాల్వ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, సంగీతం: కోటి, నిర్మాత: అశ్వని కుమార్ సహదేవ్, రచన-దర్శకత్వం: ఎన్.నరసింహారావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here