జీవి… సినిమాని తక్కువ అంచనా వేసుకోండి. ఆయన ఇంటలిజెన్స్ ని కాదు

RGV
పవన్ కళ్యాణ్ పై కుట్ర లో శ్రీ రెడ్డి ని డైరెక్షన్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ పై రమేష్ అనే సినీ దర్శకుడు రాసిన ఈ వ్యాసం సామాజిక మాధ్యమంలో విస్తృత ప్రచారంలో ఉంది
ప్రతీ తెలివైనోడు ఎక్కడో ఓ చోట తప్పు చేసి దొరికిపోతాడు. అలాగే జీవి తన సహజమైన కాన్ఫిడెన్స్ అండ్ ఆరోగెన్స్ తో జర్నలిస్ట్ లతో మాట్లాడినంత ఈజీగా activist దేవకితో మాట్లాడి అడ్డంగా బుక్కయ్యాడు. ఆవిడ పెట్టిన కేసుని తవ్వితే, పోలీసులు జెన్యూన్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే, ఆయన పాస్ పోర్ట్ లో ఫారిన్ ఎంట్రీ స్టాంప్ లేకపోతే చాలు- ఆయన్ని మూసేయడానికి.
ఎవ్రీ మినిట్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే “జీవి”తన పాస్ పోర్ట్ పేజ్ క్లిక్ చేసి ఇప్పటి వరకు పోస్ట్ చేయకపోవడమే… దాల్ మే కాలా.
నాయకురాలు నాగమ్మ అన్న ఒక్కమాటతో మొత్తం ఉద్యమమే నీరు కారిపోయే ప్రమాదంలో పడింది.
ఇన్నేళ్ళూ- తన చావు తాను చచ్చే జీవి- ఫస్ట్ టైం- ఇంకోడి బతుకు గురించి ఆలోచించాడు. నాచురాలిటీకి దగ్గరగా ఉండే తన సినిమాల్లా కాకుండా, కాంట్రాస్ట్ గా రాజమౌళి స్టైల్లో ఇంటర్వల్ బ్యాంగ్ ఇచ్చాడు మొత్తం నేనే చేసాను. అయామ్ సారీ అన్నాడు.
ఇప్పుడు Conspiracy Theory ఏంటంటే- అప్పుడు కేసు ఫైల్ చేసిన దేవకి గారు ఇతర ఆక్టివిస్టులు ఇప్పుడు ఉద్యమాన్ని గైడ్ చేస్తున్నారు.
“జీవి”లాంటి ఎంటర్టైనర్ని బొక్కలో పెట్టడం అనే చిన్న ప్రాబ్లం కంటే- దేవకిగారిలాంటి వాళ్ళకి మొత్తం స్త్రీల హక్కులు ప్రమాదంలో పడకుండా కాపాడ్డం ఆబ్వియస్గా ఇంపార్టెంట్.
ఆస్ యూసువల్గా అందరూ బ్లేమ్ “జీవి” మీదకి తోసి బ్రేకింగ్ న్యూసూ, ట్రోల్స్ కట్చేసే పన్లో బిజీ అయ్యారు. ఇక ఉద్యమం కొనసాగి, సక్సెస్ అవగానే – దేవకి గారు “జీవి”మీద కేసు వాపస్ తీసుకోవడమే క్లైమాక్స్.
PS: షాట్ మేకింగ్ లో – ఫోకస్ షిఫ్ట్ అని ఒకటుంటుంది. అది జీవి వాడినంత ఎఫెక్టివ్ గా ఎవ్వరూ వాడటం నేను ఇప్పటి వరకూ చూడలేదబ్బా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here