ఏదో జరుగుతుంది.. అనుష్క విషయంలో ఏదో జరుగుతుంది. అసలు ఎలా ఉండే హీరోయిన్ ఎలా అయిపోయింది. ఇప్పుడు అప్పుడు అంటున్నారే కానీ ఎప్పుడూ సన్నగా మారిపోయేలా లేదు జేజమ్మ. ఇప్పుడైతే మరీ ఆంటీలా మారిపోయింది. తాజాగా అ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అనుష్కను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు అనుష్క ఎందుకు ఇలా మారిపోయింది..? ఆమెకు సినిమాలంటే ఇష్టం లేదా.. ఆసక్తి లేదా..? ఇక కెరీర్ చాలనుకుంటుందా..? ఇవన్నీ ఇప్పుడు ఆమె అభిమానులకు వస్తున్న అనుమానాలే. ఈమె విషయంలో అసలేం జరుగుతుందో తెలియట్లేదు. సినిమాలు ఎందుకు ఒప్పుకోవడం లేదో.. ఎందుకు ప్రేక్షకుల ముందుకు రావడం లేదో అన్నీ చెప్పేసింది ఈ భామ.
అంతా బాగానే ఉంది కానీ బరువు విషయంలో మాత్రం అనుష్క ఇప్పటికీ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఇప్పటికీ అదే పాత రూపంలోనే కనిపిస్తుంది. మొన్న విడుదలైన భాగమతి ఫస్ట్ లుక్ లోనూ గ్రాఫిక్స్ నే వాడుకున్నాడు దర్శకుడు అశోక్. అప్పట్లో సైజ్ జీరో కోసం 100 కేజీలకు మారిపోయింది అనుష్క. గ్రాఫిక్స్ లో కవర్ చేసుకుందామంటే వద్దు న్యాచురల్ గా బరువు పెరుగుతానంటూ ఒకేసారి అన్ని కేజీలు పెరిగింది అనుష్క. ఆ సినిమా వచ్చి ఏడాది దాటినా.. ఇప్పటికీ అనుష్క నార్మల్ అవతారంలోకి మారలేదు. ఆంటీలా మారిపోయింది. ఈ రూపంతోనే బాహుబలి 2, ఓం నమో వెంకటేశాయా, సింగం 3 షూటింగ్ పూర్తి చేసారు దర్శక నిర్మాతలు. అనుష్క బరువు తగ్గే వరకు చూస్తే తమ విడుదల తేదీ ఆలస్యం అవుతుందని అంతా కాంప్రమైజ్ అయిపోయారు.
ఈమెపై ఇంత ప్రచారం జరుగుతున్నా అనుష్క మాత్రం చాలా కూల్ గా ఉంది. ఇండస్ట్రీ గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు.. అవన్నీ వూహలే అనను. అలాగని అన్నీ నిజాలు కూడా కావు. ఏ రంగంలో అయినా మంచీ చెడూ రెండూ ఉంటాయి. పాలు, నీళ్లు కలిపితే హంస పాలని మాత్రమే స్వీకరించగలదట. అలా మనం కూడా మారాలి. ఏది గ్రహించాలో, ఏది వదులుకోవాలో అనే విజ్ఞత మనకున్నప్పుడు చెడు గురించి భయపడడంలో అర్థం లేదు. ఓ సినిమా ఫ్లాప్ అయితే అంతా పోయినట్టు కాదు.. ఆ సినిమా ఎందుకు చేసానా.. అని కూడా బాధపడాల్సిన పని లేదు. ఆ సినిమాతో ఏదో నేర్చుకున్నాం అనేది తెలుసుకోవాలంటూ హితబోధ చేస్తుంది ఈ జేజమ్మ. మొత్తానికి అనుష్క తీరు చూస్తుంటే ఇప్పట్లో ఆమెను మళ్లీ గతంలో చూసిన అనుష్కలా చూడటం కష్టమే. పూర్తిగా బరువు పెరిగిన జేజమ్మనే చూడాలిక..!