టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సమంత 'యూటర్న్' !

సమంత ముఖ్య పాత్రలో నటించిన ‘యూటర్న్’ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో సమంత న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించబోతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడుతోంది.
పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాటల చిత్రీకరణ జరుపుకోనుంది. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో భూమిక చావ్లా, హీరో రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు.
నటీనటులు: 
సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా
సాంకేతిక నిపుణులు:
కథ, దర్శకత్వం: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here